పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదాలు ఇప్పట్లో ఆగేలాగా కనపడట్లేదు. ఒకవైపు నుంచి ఒక మాట అంటే మరో వైపు నుంచి పది మాటలు వస్తున్నాయి. తాజాగా బ్రో వివాదంపై పవన్ రెండో మాజీ భార్య రేణు దేశాయ్ మాట్లాడిన మాటలను ఉద్దేశిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆమెకు సలహా ఇచ్చారు. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని! అంటూ ట్వీట్ చేశారు.
కాగా ఇవాళ రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మాట్లాడుతూ.. పవన్ సినిమా వివాదం గురించి తనకు పెద్దగా తెలియకపోయినా కొందరు పవన్ పెళ్లిళ్లు.. పిల్లల గురించి సినిమాలు.. వెబ్ సిరీస్‌లు నిర్మిస్తానంటున్నారు. దయచేసి ఆ వివాదంలోకి తమను లాగకండి అంటూనే.. పవన్ చాలా నిజాయితీపరుడు అని రాజకీయంగా తన సపోర్ట్ ఆయనకు ఎప్పుడూ ఉంటుందని అలాగే అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలంటూ వేడుకుంది.
మొత్తానికి పవన్ అతి ఉత్సాహంతో అంబటిని తన సినిమాలో వెటకరించి ఆనందం పొందాలనుకుంటే ఆ సినిమా మొత్తం వివాదాల చుట్టూనే తిరుగుతోంది. ఎన్నో నెలలు ఆలోచించి రాజకీయ యాత్ర మొదలుపెడితే ఆయన రాజకీయ పార్టీ కంటే ఆయన వ్యక్తిగతమే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వివాదలపై మెగా ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ రాగా తాజాగా మాజీ కుటుంబ సభ్యుల నుండి కూడా పవన్‌కు సపోర్ట్ రావడం విశేషం.