జనసేన బోణీ కొట్టింది

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహీ యాత్రను గురువారం నుంచి చేపడుతున్నారు. అందుకోసం ఆయన ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఉత్తరాంధ్రాలో పార్టీ విస్తరణ కోసం ఈ యాత్ర దోహదపడుతుందని జనసేన…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహీ యాత్రను గురువారం నుంచి చేపడుతున్నారు. అందుకోసం ఆయన ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఉత్తరాంధ్రాలో పార్టీ విస్తరణ కోసం ఈ యాత్ర దోహదపడుతుందని జనసేన భావిస్తున్న పరిస్థితులలో ఆ పార్టీలోకి ఒక మాజీ మంత్రి వచ్చి చేరారు.

విజయనగరం జిల్లా గజపతినరగానికి చెందిన పడాల అరుణ జనసేనలో చేరారు. ఆమె టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి బాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2009లో ఆమె ఓడిపోయాక టీడీపీ పక్కన పెట్టింది. ఆమె 2021లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

అందులో ఆమె చురుకుగాలేరు. ఇపుడు మిత్రపక్షం అయిన జనసేనలోకి చేరడం విశేషం. వచ్చే ఎన్నికల్లో గజపతినగరం నుంచి పోటీ చేయాలని పడాల అరుణ భావిస్తున్నారు. ఈ సీటు టీడీపీకి కీలకంగా ఉంది. టీడీపీ బీజేపీలలో పనిచేసిన అరుణ జనసేనను ఎంచుకోవడం విశేషం. 

వారాహి యాత్రలో ఇది తొలి బోణి అని జనసేన నేతలు అంటున్నారు. రానున్న రోజులలో తెలుగుదేశం నుంచి కూడా జనసేనలోకి చేరే వారు ఉన్నారని ప్రచారం సాగుతోంది. పవన్ పది రోజుల యాత్రలో ఆ పార్టీ కండువా మరేంత మంది కప్పుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.