బిగ్‌బాస్ షోకి ఒక్కసారి వెళితే పాపులారిటీ పదింతలవుతుందనేది నిజమే అయినా కానీ దానిని సక్రమంగా వాడుకుని కెరీర్ బిల్డ్ చేసుకున్నవాళ్లు తక్కువ. గ్లామర్ ఇండస్ట్రీలో పర్టిక్యులర్‌గా ఇవే చేయాలంటూ గిరి గీసుకుంటే కుదరదు. బిగ్‌బాస్‌కి వెళ్లిన వాళ్లలో చాలా మంది అప్పుడొచ్చిన ఇన్‌స్టంట్ ఫేమ్‌ని ఎక్కువ అంచనా వేసుకుని లాంగ్ టైమ్ కెరీర్ ప్లానింగ్‌పై ఫోకస్ పెట్టరు.
ఈలోగా కొత్త బిగ్‌బాస్ ప్లేయర్లు వచ్చేసి గత సీజన్ వాళ్లు పాతబడిపోతారు. ఈ సీజన్‌కి వెళ్లిన వారినే తీసుకుంటే దివికి చాలా క్రేజ్ వచ్చింది. అయితే ఆమె హీరోయిన్‌గా అవకాశాలు కావాలంటూ చాలా ఛాన్స్‌లు మిస్ చేసుకుంటోంది.
మరి తాను కోరుకున్న బ్రేక్ ఎప్పటికి వస్తుందనేది తెలియదు కానీ గుజరాత్‌నుంచి మరోసారి హైదరాబాద్‌కి వచ్చిన మోనల్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసింది.
ఆల్రెడీ హీరోయిన్ ఇమేజ్ వుంది కనుక లీడ్ క్యారెక్టర్లు వస్తేనే చేస్తానంటూ మోనల్ బిగిసిపోలేదు. ఎలాంటి పాత్ర అయినా చేస్తానంటూ ఐటెమ్ సాంగుల నుంచి, టీవీ షోలకు జడ్జీగా వ్యవహరించడం నుంచి వెబ్ డ్రామాల వరకు ఏదొస్తే అది అందిపుచ్చుకుంటోంది.
ఈ బిగ్‌బాస్ క్రేజ్ త్వరలో చల్లారిపోతుందని మోనల్‌కు తెలుసు. అందుకే దీపముండగానే లకలు మూటగడుతోంది.