పుష్పకోసం కాస్ట్‌లీ జిగేలు రాణి!

సుకుమార్ ఎంత జీనియస్ డైరెక్టర్ అయినా కానీ ఐటెమ్ సాంగ్స్ విషయంలో మాత్రం పక్కా మాస్ డైరెక్టర్లు కూడా అతనితో పోటీ పడలేరు. సుకుమార్ సినిమాలంటే అదిరిపోయే ఐటెమ్ సాంగులకు పెట్టింది పేరు. తన…

సుకుమార్ ఎంత జీనియస్ డైరెక్టర్ అయినా కానీ ఐటెమ్ సాంగ్స్ విషయంలో మాత్రం పక్కా మాస్ డైరెక్టర్లు కూడా అతనితో పోటీ పడలేరు. సుకుమార్ సినిమాలంటే అదిరిపోయే ఐటెమ్ సాంగులకు పెట్టింది పేరు. తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా పూనకం వచ్చినట్టుగా సుకుమార్ సినిమాలకు పాటలు చేస్తుంటాడు.

దేవి నుంచి వచ్చిన లాస్ట్ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ కూడా సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలమే. ప్రస్తుతం తమన్ డిమాండ్‌లో వున్నాడు కనుక పుష్పకు అతడి పేరుని అల్లు అర్జున్ సిఫార్సు చేసినప్పటికీ సుకుమార్ మాత్రం దేవిని విడిచిపెట్టలేదు. లాక్‌డౌన్‌లో పుష్ప పాటలు అన్నీ ఓకే చేసేసారు. రంగస్థలం మించిన ఆల్బమ్ దేవి సిద్ధం చేస్తున్నట్టు టాక్.

ఇందులో కూడా ‘జిగేలు రాణి’ లెవల్ ఐటెమ్ సాంగొకటి వుంటుందట. అందులో ఆ పాటను ఫామ్‌లో వున్న పూజ హెగ్డేతో చేయించినట్టుగా ఈ పాటకు కూడా పాన్ ఇండియా అప్పీల్ తెచ్చే భామను తీసుకొస్తున్నట్టు భోగట్టా.

ప్రస్తుతం నార్త్‌లో యూత్‌ను వెర్రెక్కిస్తోన్న దిశా పాట్నీ ఈసారి జిగేల్‌మనే అవకాశముందట. కానీ ఆమెతో పాట చేయించుకోవాలంటే కనీసం కోటి పైనే చదివించుకోవాలట. మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తారు కనుక ఆమె పారితోషికం పెద్ద ఇష్యూ కాకపోవచ్చు.

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!