బిగ్ బాస్ లోకి మళ్లీ అందరూ

బిగ్ బాస్ 4 సీజన్ ముంగింపు దగ్గరకు వచ్చేసింది. చివరి రోజు గ్రాండ్ ఫినాలె. ఈ లోగా మూడు రోజులు ముందుగా బిగ్ బాస్ హవుస్ లో పార్టీ మూడ్ ను తీసుకురావాలని షో…

బిగ్ బాస్ 4 సీజన్ ముంగింపు దగ్గరకు వచ్చేసింది. చివరి రోజు గ్రాండ్ ఫినాలె. ఈ లోగా మూడు రోజులు ముందుగా బిగ్ బాస్ హవుస్ లో పార్టీ మూడ్ ను తీసుకురావాలని షో నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 న మళ్లీ బయటకు వచ్చిన టీమ్ మేట్స్ అందరినీ లోపలకు పంపించే ఆలోచన చేస్తున్నారు. 

అంటే 17,.18,19 మూడు రోజుల పాటు టోటల్ సభ్యులు హవుస్ లో వుంటారన్నమాట. అయితే ఇది ఎంతవరకు సాధ్యం? కరోనా నెపథ్యంలో మళ్లీ పరిక్షలు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ వుంటాయి. 

అలాగే గ్రాండ్ ఫినాలె లో కొందరు సభ్యులత చేత డ్యాన్స్ లు, స్కిట్ లు లాంటివి చేయించే ఆలోచన చేస్తున్నారు.  ఈ మేరకు కూడా సమాలోచనలు, స్క్రిప్ట్ లు తయారువుతున్నాయి.

గ్రాండ్ ఫినాలె నాడు ఎలాగూ సందడి వుంటుంది టీఆర్పీ వుంటుంది. ముందు వారం కూడా మంచి టీఆర్పీ నమోదుచేయాలి అంటే సభ్యులు అందరూ మరోసారి హవుస్ లోకి వెళ్తే బాగానే వుంటుంది. కానీ అందరూ దానికి ఓకె అంటారా? అన్నది చూడాలి.

సోహైల్ ని ఎప్పటికీ మర్చిపోను