ముక్కు అవినాష్ గా పేరు పడిన జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 కు మాంచి ఎంటర్ టైనర్ గా నిలిచాడు. మాగ్జిమమ్ వీక్స్ హవుస్ లో వుండి, వ్యూవర్స్ కు వినోదాన్ని పంచాడు.
బిగ్ బాస్ హవుస్ లో వెళ్లడానికి జబర్దస్త్ నిర్వాహకులు పాపం అవినాష్ ను కొంచెం ఇబ్బంది పెట్టారని, ఆ ఇబ్బందులు అధిగమించడానికి అప్పు కూడా చేయాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వినవచ్చాయి.
ఆ వార్తలు నిజం కాకపోయి వుంటే బిగ్ బాస్ హవుస్ నుంచి బయటకు వచ్చాక అవినాష్ మళ్లీ జబర్దస్త్ షోకి వెళ్లి వుండేవాడు. కానీ అలా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. జబర్దస్త్ నిర్వాహకుల వైఖరికి బాధపడిన అవినాష్ ఇప్పుడు మాటీవీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.
మా టీవీలో ఓ మాంచి షో చేసే దిశగా డిస్కషన్లు, ఆలోచనలు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అనుకున్న ప్లాన్ లు అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో మా టీవీలో అవినాష్ ఎంటర్ టైన్ మెంట్ స్టార్ట్ అవుతుంది.