చంద్రబాబు.. తోక మీడియా… తోక పార్టీలు

మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పోలవరం కేంద్రంగా బాబు చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టిన నాని.. చంద్రబాబుకు అమరావతి ఒక్కటి ఉంటే చాలని, తన సామాజిక వర్గంతో హాయిగా కాలం గడిపేస్తాడని విమర్శించారు.…

మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పోలవరం కేంద్రంగా బాబు చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టిన నాని.. చంద్రబాబుకు అమరావతి ఒక్కటి ఉంటే చాలని, తన సామాజిక వర్గంతో హాయిగా కాలం గడిపేస్తాడని విమర్శించారు.

“చంద్రబాబుకు, చంద్రబాబు తోక పార్టీలకు, తోక మీడియాకు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదు. ఎంత మంది చచ్చినా ఫర్వాలేదు. 29 గ్రామాల అమరావతి ఉంటే చంద్రబాబుకు చాలు. తన పార్టీని ఆ 29 గ్రామాలకు పరిమితం చేసి, మిగతా ప్రాంతాలు ఎలా పోయినా అక్కర్లేదన్నట్టు ఉన్నారు. ఆయన సామాజిక వర్గం బాగుంటే చాలు.”

అమరావతిలో 33వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు… లక్షల కోట్లు తెచ్చి అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసి ఆ రైతులు మాత్రమే బాగుపడితే చూడాలనుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు. మిగతా రైతులంతా ఎలా పోయినా బాబుకు అనవసరమని, తమ ప్రభుత్వం మాత్రం అలా ఆలోచించదని అన్నారు.

“రాష్ట్రప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బాబుకు మరోసారి  బుద్ధి చెబుతారు. అయితే ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా చంద్రబాబుకు సిగ్గులేదు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. చంద్రబాబును పట్టించుకోవాల్సిన అవసరం మా పార్టీకి గానీ, రాష్ట్రానికి గానీ లేదు.”

ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై స్పందిస్తూ.. జనవరి నుంచి పథకాల అమలు మరింత ఊపందుకుంటుందని.. ప్రతి నెలా పండగలా ఉంటుందన్నారు నాని. డిసెంబర్ 25 నుంచి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమం ఓ పండగలా సాగుతుందన్నారు.

బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో నాకు తెలుసు