సినిమాల విడుదలలు ఆగిపోయిన తరువాత ఓ థియేటర్ విడుదల అంత బజ్ ను తెచ్చుకున్న సినిమా ఏక్ మినీ కథ. టాలీవుడ్ లో స్తబ్దు అయిన వాతావరణం నెలకొన్న టైమ్ లో ఏక్ మినీ కథ సినిమా కాస్త గట్టి హడావుడే చేస్తోంది.
మరే సినిమా సంగతి లేదు. మరే సినిమా హడావుడి లేదు. దాంతో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా'ఏక్ మినీ కథ' గడబిడే ఎక్కువగా కనిపిస్తోంది.వినిపిస్తోంది. నిజానికి లాక్ డౌన్ ముందే టీజర్, ప్రమోషన్లతో 'ఏక్ మినీ కథ' ఆకట్టుకుంది.
జనాలు కాస్త క్యూరియాసిటీ కనబర్చే లోపే లాక్ డౌన్ వచ్చి, అంతా సైలంట్ అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు యువి సంస్థ అధినేతలు, వంశీ, విక్రమ్ ఆమెజాన్ ప్రయిమ్ కు మాంచి లాభసాటి బేరానికి అమ్మేసారు.
ఈ రోజు రాత్రి విడుదలవుతున్న సినిమాలో హీరో సంతోష్. డైరక్టర్ శోభన్ కొడుకు అయిన సంతోష్ ఇప్పటికి ఒకటి రెండు సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో బ్రేక్ వస్తుందనే ఆశతో వున్నాడు.
డైరక్టర్ మేర్లపాక గాంధీ తన శిష్యుడు కార్తీక్ ను ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఫ్యామిలీ మూవీ ఇదేనేమో?