స్టార్ హీరో సినిమాపై వివాదం.. ఇది మరీ టూమచ్!

స్టార్ హీరోల సినిమాలకు వివాదాలు తప్పడం లేదు. కొన్ని కొన్ని అర్థ సహిత వివాదాలు కాగా, మరికొన్ని అర్థ రహిత వివాదాలు. అలాంటిదే ఇప్పుడు తమిళ హీరో విజయ్ సినిమా 'బిగిల్' విషయంలో నెలకొంటోంది.…

స్టార్ హీరోల సినిమాలకు వివాదాలు తప్పడం లేదు. కొన్ని కొన్ని అర్థ సహిత వివాదాలు కాగా, మరికొన్ని అర్థ రహిత వివాదాలు. అలాంటిదే ఇప్పుడు తమిళ హీరో విజయ్ సినిమా 'బిగిల్' విషయంలో నెలకొంటోంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించి ఒక స్టిల్ ను విడుదల చేశారు. అందులో హీరో విజయ్.. మటన్ కొట్టే చెక్క మీద కాలు పెట్టుకుని కూర్చుని ఉంటాడు. అక్కడే మటన్ కొట్టే కత్తి కూడా ఉంటుంది. ఇదే వివాదం అయ్యిందిప్పుడు!

అందులో వివాదం ఏమిటి? అంటే.. అలా మటన్ కొట్టే చెక్క మీద కాలు పెట్టుకోవడం తప్పు అట. మాంస విక్రేతలు తమ వ్యాపారాలు మొదలుపెట్టేటప్పుడు దానికి దండం పెట్టుకుని, పని ప్రారంభిస్తారని.. అలాంటి చెక్క మీద హీరో కాలు పెట్టుకోవడం తప్పు అని తమిళనాట వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మాంస విక్రేతలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారట.

వారికి అధికార అన్నాడీఎంకే మద్దతు కూడా పలికిందట. మాంస విక్రేతల తరఫున అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మటన్ కొట్టడానికి ఉపయోగించే చెక్క మీద విజయ్ కాలు పెట్టుకున్న స్టిల్ ఇలా వివాదం రేపింది.

వివాదాలు రేపడానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. అయితే ఏదోలా వివాదం రేపాలని తాపత్రయపడుతూ జనాలు.. ఏమీ లేనిచోట కూడా ఏదో ఒక వివాదాన్ని రేపేలా తయారయినట్టున్నారు. ఈ వివాదాలను సినీజనాలు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వాటితో సినిమాలకు బోలెడంత పబ్లిసిటీ కూడా వస్తోంది.

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు