Advertisement

Advertisement


Home > Movies - Movie News

బింబిసార..ఫాలో మగథీర

బింబిసార..ఫాలో మగథీర

రెండు జన్మలు సినిమాలు చాలా వచ్చాయి. అలాంటి వాటిలో మగధీర ది ఓ ప్రత్యేకత. రాజుల‌ కాలానికి, వర్తమానానికి ముడిపెడుతూ సాగిన కథ. ఇప్పుడు అదే స్టయిల్ లో చరిత్రలో ఓ కథకూ, వర్తమానానికి ముడిపెడుతూ కథ అల్లుకున్నట్లు కనిపిస్తోంది లేటెస్ట్ గా విడుదలయిన బింబిసార టీఙర్ చూస్తుంటే. 

కళ్యాణ్ రామ్ హీరోగా తయారైన ఈ సినిమా అశోకుడి తాత అయిన బింబిసారుడి వ్యవహారానికి, వర్తమానంలో మళ్లీ ఙన్మించడానికి మధ్య ఏదో ముడి వేస్తూ అల్లుకున్నట్లు కనిపిస్తోంది.​

భారీగా కనిపిస్తోంది. కెమేరా పనితనం, సిఙి పనితనం బాగానే వుంది. కానీ బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ ఎంత వరకు ఫిట్ అయ్యాడన్నది పూర్తిగా సినిమా చూస్తే తప్ప డిసైడ్ కావడం కష్టం. 

టీఙర్ లో కత్తి మెరపులు, కంటి మెరుపులు మాత్రమే కాబట్టి వ్యవహారం బాగానే వుంది. బేస్ వాయిస్ లో వాయిస్ ఓవర్ ఓకె. కళ్యాణ్ రామ్ కు ప్రయోగాలు అంటే ఇష్టం. బహుశా అందుకే ఇంత భారీ ఖర్చుకు రెడీ అయిపోయి ఈ మగధీర టైపు ఙోనర్ ను ట్రయ్ చేస్తున్నారేమో. అన్నట్లు టీఙర్ లో కీలకమైన వాయిస్ ఓవర్ కోసం బాలయ్యను ట్రయ్ చేసారని బోగట్టా అది కుదిరినట్లు లేదు. ఎవరి చేతో చెప్పించారు కానీ అంత ఇంప్రెసివ్ గా లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?