Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్.. బాలీవుడ్ లో సమంత బిగ్ స్టెప్?

ఎక్స్ క్లూజివ్.. బాలీవుడ్ లో సమంత బిగ్ స్టెప్?

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా కెరీర్ పై దృష్టిపెట్టింది సమంత. తెలుగు-తమిళ భాషల్లో సినిమాలు ప్రకటించడంతో పాటు రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే  ఊపులో బాలీవుడ్ పై దృష్టి పెట్టింది సమంత. ఇందులో భాగంగా ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉంది.

బాలీవుడ్ బిగ్ బ్యానర్లలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ తో చర్చలు జరుపుతోంది సమంత. ఒకేసారి 2 లేదా 3 సినిమాలకు యష్ రాజ్ తో ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికైతే టాక్స్ నడుస్తున్నాయి. డీల్ సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

హీరోయిన్లతో కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడంలో యష్ రాజ్ ఫిలిమ్స్ ట్రాక్ రికార్డ్ గురించి అందరికీ తెలిసిందే. కత్రినాకైఫ్, అనుష్క శర్మ, కరీనా కపూర్ లాంటి ఎంతోమంది హీరోయిన్లు యష్ రాజ్ సినిమాలతోనే పాపులర్ అయ్యారు. రెమ్యూనరేషన్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ బ్యానర్ లో సినిమాలు చేయడం వల్ల వాళ్ల కెరీర్ కు ప్లస్ అయింది.

ఇప్పుడు సమంత కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ సహకారంతో బాలీవుడ్ లీగ్ లోకి ఎంటరయ్యే ఆలోచనలు చేస్తోంది. అయితే వీళ్లతో కాంట్రాక్ట్ అంటే మామూలుగా ఉండదు. దాదాపు 3-4 ఏళ్ల పాటు లాక్ అయిపోయినట్టే. ఈలోగా బయట బ్యానర్లలో క్రేజీ ఆఫర్లు వస్తే, చేసేదేం ఉండదు.

ఆల్రెడీ సమంతకు ఫ్యామిలీ మేన్ సీజన్-2తో బాలీవుడ్ లో అంతోఇంతో క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో బయట అవకాశాలు వెదుక్కోవాలా లేక యష్ రాజ్ డీల్ తో ముందుకెళ్లాలా అనే డైలమాలో ఉంది సమంత. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?