కళ్యాణ్ రామ్ నటించిన టైం ట్రావెల్ మూవీ బింబిసార చిరకాలంగా వార్తల్లో వుంది. కానీ ట్రయిలర్ బయటకు రావడంతో బజ్ ఒక్కసారిగా అందుకుంది. ఈ రేంజ్ లో పిక్చరైజేషన్ వుంటుంది అనుకోలేదు.
అందుకే టాక్ బాగా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను నిర్మాత దిల్ రాజు 9 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా 9 కోట్లు అంటే దిల్ రాజుకు మంచి రేటు కు వచ్చినట్లే అన్నది బిజినెస్ సర్కిళ్ల మాట. అంతే కాదు, ఇక్కడ రిఫండబుల్ క్లాజ్ కూడా వుందని, అందువల్ల దిల్ రాజుకు అస్సలు రిస్క్ లేదని అంటున్నారు.
బింబిసార చిత్రంలో సంయుక్త మీనన్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించారు. వశిష్ఠ దర్శకుడు. కళ్యాణ్ రామ్ నే నిర్మాత.