జైభీమ్ సినిమా సంచలనం రేకెత్తిస్తోంది. సామాజికంగా నిమ్న వర్గాల అణచివేతపై తీసిన జైభీమ్ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయవాదిగా హీరో సూర్య క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. విస్తృత చర్చకు దారితీసిన జైభీమ్ హీరో సూర్యపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా వ్యంగ్యాస్త్రాలు విసరడం గమనార్హం.
ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కావడమే సూర్యపై విమర్శలకు దారి తీసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా ట్విటర్ వేదికగా సూర్యపై తనదైన స్టైల్‌లో సెటైర్లు విసిరారు. గతంలో సూర్య అన్న మాటలను తీసుకుని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
మన పిల్లలకు మూడు భాషలు వద్దంటూ వ్యాఖ్యలు చేసిన హీరో ఇపుడు తన సినిమాను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేశారంటూ విమర్శించారు. ఇలాంటి స్వార్థపరులను ఎలా అర్థం చేసుకోవాలంటూ హెచ్. రాజా నిలదీయడం హాట్ టాపిక్‌గా నిలి చింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే…రాజా ట్వీట్‌ను హీరో సూర్య సైతం లైక్ చేశారు.
బహుశా రాజాకు ఇదే తన సమాధానమని సూర్య చెప్పినట్టైంది. మాటలకు, చేతలకు తేడా ఉండకూడదనేది బీజేపీ నేత ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే సూర్యపై తన అక్కసును, ఆగ్రహాన్ని ఆయన ప్రదర్శించారు. బీజేపీ నేత ట్వీట్‌పై సూర్య అభిమానులు మండిపడుతున్నారు.
సినిమాలోని అణచివేతదారుల్లో తమను బీజేపీ నేతలు చూసుకుంటున్నట్టుగా ఉందని కామెంట్స్ చేయడం విశేషం.