నమితకు చేదు అనుభవం

ఈరోజు జన్మాష్టమి. అంతా ఆలయాలకు క్యూ కట్టారు. నమిత కూడా అదే పనిచేసింది. కానీ చేదు అనుభవం ఎదురైంది. దీంతో తన ఆవేదన మొత్తం సోషల్ మీడియాలో పెట్టింది ఈ మాజీ హీరోయిన్. Advertisement…

ఈరోజు జన్మాష్టమి. అంతా ఆలయాలకు క్యూ కట్టారు. నమిత కూడా అదే పనిచేసింది. కానీ చేదు అనుభవం ఎదురైంది. దీంతో తన ఆవేదన మొత్తం సోషల్ మీడియాలో పెట్టింది ఈ మాజీ హీరోయిన్.

భర్తతో కలిసి మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్లింది నమిత. తనను ఆలయ సిబ్బంది 20 నిమిషాల పాటు ఆపారని ఆమె ఆరోపించింది. తన హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని ప్రశ్నించారని, ఇప్పటివరకు తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని వాపోయింది.

తను తిరుపతిలో పెళ్లి చేసుకున్నానని, కొడుక్కి కృష్ణుడి పేరు పెట్టుకున్నానని, తను హిందూ ధర్మాన్ని పాటిస్తానని అందరికీ తెలుసని, కానీ తనను కావాలనే ఆపారని, 20 నిమిషాల పాటు ఓ మూల నిల్చోబెట్టారని నమిత ఆరోపించింది.

నుదుటిపై కుంకుమ పెట్టుకున్న తర్వాతే తనను దర్శనానికి అనుమతించారని, తను ఆలయానికి వస్తున్నట్టు ముందురోజే పోలీసులకు సమాచారం అందించానని, అయినప్పటికీ తన పట్ల సిబ్బంది దురుసుగా వ్యవహరించారని నమిత ఆరోపించారు.

నమిత ఆరోపణలపై ఆలయ అధికారులు స్పందించారు. ఆమెతో అమర్యాదకరంగా ప్రవర్తించలేదని, ఆలయ నిబంధనల మేరకే వ్యవహరించామని, కుంకుమ పెట్టుకున్న తర్వాత ఆలయంలోకి అనుమతించామని వెల్లడించారు. నమిత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతోంది.

10 Replies to “నమితకు చేదు అనుభవం”

  1. ఏదో ఇలా పేరున్న వారిని పాపం ఇలా చేస్తారు.. ముక్కు మొహం తెలీనివారు ఏ మతమో ఎలా తెలుస్తుంది..

Comments are closed.