Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలీవుడ్ హీరోయిన్లకు నచ్చేస్తున్నాడు!

 బాలీవుడ్ హీరోయిన్లకు నచ్చేస్తున్నాడు!

బాలీవుడ్ హీరోయిన్లకు విజయ్ దేవరకొండ అంటే చాలా క్రేజే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించింది. సౌత్ లో ఎవరి సరసన నటించాలని అనుకుంటున్నారు? అంటే.. విజయ్ దేవరకొండ పేరును టక్కున చెప్పింది జాన్వీ కపూర్.

'అర్జున్ రెడ్డి'తో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ అలా యంగ్ హీరోయిన్లను ఆకట్టుకుంటూ ఉన్నాడు. ప్రత్యేకించి బాలీవుడ్ లో విజయ్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో అలియా భట్ కూడా ఒక ఆసక్తిదాయకమైన కామెంట్ చేసింది.

మీకు నచ్చిన స్టైలిష్ హీరో ఎవరు? అంటే.. తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. హీరోయిన్లలో అనుష్క శర్మ స్టైలిష్ అని, హీరోల్లో విజయ్ దేవరకొండ.. అని అలియా భట్ చెప్పింది. ఇలా విజయ్ పై సానుకూల ప్రకటన  చేసిన మరో బాలీవుడ్ నటీమణిగా అలియా నిలుస్తోంది.

ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించకపోయినా.. విజయ్ దేవరకొండ ఇలా బాలీవుడ్ వాళ్లను తెగ ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?