ఇటీవలే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి. ఇంతలోనే రణ్ బీర్ కపూర్, అలియా భట్ లు ఒక ఇంటి వారవుతున్నారు. వీరి కన్నా కాస్త సీనియర్లు విరాట్ కొహ్లీ, అనుష్కా శర్మ, ఇంకా రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్!
ఇలా బాలీవుడ్ లో తారల పెళ్లిళ్ల ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇదేం కొత్త కాకపోయినా.. సుదీర్ఘకాలం పాటు ఈ జంటలు ప్రేమలో మునిగి తేలినవే! చాలా కాలం పాటు.. అంటే సంవత్సరాల పాటు వీరు డేటింగ్, ప్రేమ, లివింగ్ రిలేషన్ షిప్ తరహా వార్తల్లో నిలిచారు. అలాంటి వారికి కొత్త కూడా కాదు!
అంతకు ముందు కూడా వీరికి అలాంటి అనుభవాలున్నాయి. రణ్ భీర్, కత్రినాల స్టోరీ కొన్నేళ్ల పాటు నడిచింది. అలియాకు కూడా అలాంటి వార్తల్లో నిలిచింది. విరాట్ పేరూ వేరే వారితో వినిపించింది. ఆ ప్రేమకథలు బ్రేకప్ అయ్యాయి. కొన్నేళ్లకు అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. అలాంటి అనుభవాల నేపథ్యంలో.. వీరు తదుపరి ప్రేమకథలను కూడా అలాగే ముగిస్తారనే అభిప్రాయాలు సహజమైనవే.
వీరు ఎంత ప్రేమించుకుంటున్నారని చెప్పినా, జంటగా ఎన్ని ఫొటోలను పోస్టు చేసినా.. ఏదో ఒక దశలో బ్రేకప్ అంటారనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. అందుకే ఈ జంటలు పెళ్లి చేసుకుబోతున్నాయనే వార్తలు వచ్చినా, వాటిని ఎవ్వరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.
అయితే జనాలు సీరియస్ గా తీసుకున్నా, తీసుకోకపోయినా.. తాము మాత్రం సీరియస్ గా తీసుకున్నట్టుగా బాలీవుడ్ జంటలు ఒకదాని తర్వాత మరోటి నిరూపించుకుంటున్నాయి. రణ్ వీర్, దీపిక, విరాట్, అనుష్క, విక్కీ కౌశల్, కత్రినా, ఇప్పుడు అలియా, రణ్ బీర్ కపూర్.. మరి నెక్ట్స్ ఎవరో!