స్కంద అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఇలాంటి టైమ్ లో బోయపాటికి ఎవరు ఛాన్సిస్తారు? మరోసారి బాలయ్య ఆదుకోవాల్సిందే. మొన్నటివరకు వినిపించిన కామెంట్స్ ఇవి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. స్కంద ఫ్లాప్ తర్వాత బోయపాటి ఏకంగా బన్నీతో సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం కథ రాసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇది గాసిప్ కాదు, స్వయంగా బన్నీ ఆప్తమిత్రుడు, నిర్మాత బన్నీ వాస్ బయటపెట్టిన మేటర్. అవును… బన్నీ కోసం బోయపాటి కథ రాస్తున్నాడట. బన్నీకి కథ నచ్చితే కచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుందంటున్నారు వాస్.
“బన్నీ కోసం త్రివిక్రమ్ ఓ లైన్ రెడీ చేసి పెట్టారు. గుంటూరుకారం పూర్తయిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. అది పెద్ద సినిమా, స్టార్ట్ అవ్వడానికే ఏడాదికి పైగా పడుతుంది. ఈ గ్యాప్ లో బన్నీ ఓ సినిమా చేయొచ్చు. అందుకే బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.”
గతంలో బన్నీ-బోయపాటి కాంబోలో సరైనోడు వచ్చింది. అప్పట్నుంచి మళ్లీ వీళ్ల కాంబినేషన్ కోసం ఆర్మీ ఎదురుచూస్తోంది. అయితే ఇలాంటి టైమ్ లో బోయపాటికి బన్నీ ఛాన్స్ ఇస్తాడా అనేది వేచిచూడాలి.
మరోవైపు బన్నీతో సినిమా చేసేందుకు సందీప్ వంగ లాంటి దర్శకులు ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. అయితే త్రివిక్రమ్, సందీప్ రెడ్డికి బన్నీతో చేయాల్సిన తమ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో ఓ క్లారిటీ ఉందని అన్నారు వాసు.
మొత్తానికి బన్నీ వాస్ ప్రకటనతో బన్నీ-బోయపాటి కాంబినేషన్ మరోసారి తెరపైకొచ్చింది. పుష్ప-2, త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాల మధ్య గ్యాప్ తీసుకోకూడదని అల్లు అర్జున్ ఫిక్స్ అయితే మాత్రం బోయపాటి పంట పండినట్టే.