Advertisement

Advertisement


Home > Movies - Movie News

బుక్కయిన బ్రహ్మాజీ.. కామెడీ చేద్దాం అనుకున్నాడు

బుక్కయిన బ్రహ్మాజీ.. కామెడీ చేద్దాం అనుకున్నాడు

నటుడు బ్రహ్మాజీని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లకు నిజజీవితంలో కూడా అతడెంత కామెడీగా ఉంటాడో అర్థమౌతుంది. అతడు పెట్టే పోస్టులు కొన్ని నవ్విస్తాయి, మరికొన్ని సెటైరిక్ గా ఉంటాయి. ఇలానే పేలుతుందనే భ్రమలో ఓ పోస్టు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు ఈ సీనియర్ నటుడు.

ఇంతకీ ఏం జరిగిందంటే...హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. వరదలకు లోతట్టు కాలనీలన్నీ మునిగిపోయాయి. పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఓవైపు పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంటే.. వరదలపై సెటైర్ వేశాడు బ్రహ్మాజీ. "ఓ మోటారు బోటు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎవరైనా సలహా ఇవ్వండి" అంటూ పోస్ట్ పెట్టాడు. హైదరాబాద్ ఫ్లడ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా దానికి జోడించాడు.

బ్రహ్మాజీ పెట్టిన ఈ పోస్టుపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఓవైపు వరదలతో ఇళ్లు మునిగి, ప్రాణాలు పోతుంటే.. బోటు కొంటానంటూ కామెడీ చేస్తావా అంటూ బ్రహ్మాజీకి క్లాస్ పీకుతున్నారు జనం. ఏపీలో, చెన్నైలో వరదలొస్తే సానుభూతి తెలిపి, ఛారిటీ ఫండ్స్ కలెక్ట్ చేసే బ్రహ్మాజీకి హైదరాబాద్ లో వరదలు మాత్రం కామెడీగా కనిపిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వీలైతే సహాయం చేయండి, కామెడీ చేయకండి, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి అంటూ మరికొందరు సుతారంగా చురకలు అంటిస్తే.. ఇంకొంతమంది మాత్రం కాస్త ఘాటుగానే బ్రహ్మాజీని హెచ్చరించారు. హైదరాబాద్ మీద జోకులేసే వాళ్లకు హైదరాబాద్ లో ఉండే అర్హత లేదంటూ కోపగించుకున్నారు.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వందల సంఖ్యలో బ్రహ్మాజీకి వ్యతిరేకంగా కామెంట్స్ పడుతున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఇదే వరదల్లో బ్రహ్మాజీ ఇల్లు కూడా మునిగిపోయింది. బోటు కావాలంటూ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే తన ఇల్లు కూడా మునిగిపోయిన విషయాన్ని బయటపెట్టాడు బ్రహ్మాజీ.

పాపం, ఆర్కేని ఎలా మోసం చేయాలనిపించింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?