బ్రేకింగ్ – జగన్ దగ్గరకు లిమిటెడ్ టీమ్

టాలీవుడ్ జనాల ఆలోచనకు అడ్డుకట్ట పడింది. పాతిక ముఫై మంది డెలిగేషన్ వెళ్లి ఆంధ్ర సిఎమ్ ను కలిసి రావాలనుకుంటే, సిఎమ్ పేషీ నుంచి రివర్స్ మెసేజ్ వచ్చింది.,  అంత మంది అవసరం లేదు.…

టాలీవుడ్ జనాల ఆలోచనకు అడ్డుకట్ట పడింది. పాతిక ముఫై మంది డెలిగేషన్ వెళ్లి ఆంధ్ర సిఎమ్ ను కలిసి రావాలనుకుంటే, సిఎమ్ పేషీ నుంచి రివర్స్ మెసేజ్ వచ్చింది.,  అంత మంది అవసరం లేదు. అయిదారుగురు మాత్రమే రావాలని రాత్రికి రాత్రి ఆంధ్ర సిఎమ్ ఆఫీసు నుంచి వర్తమానం అందింది. ఓ దశలో ఆంధ్ర సిమ్ ను కలిసే కార్యక్రమం క్యాన్సిల్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆఖరికి అయిదుగురు చాలరు మరి ముగ్గురికి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసారు. దాంతో అక్కడి నుంచి సరే అన్నారు.

చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, , దామోదర్ ప్రసాద్, సి. కళ్యాణ్, దిల్ రాజు, సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్ లను ఫైనల్ జాబితాలో చేర్చారు. అంతకు ముందు అనుకున్న వారందరినీ ఫిల్టర్ చేసారు. నిజానికి సి కళ్యాణ్, డి సురేష్ బాబు, దామోదర్ ప్రసాద్ లు వెళ్లడం ఇండస్ట్రీలోని వైకాపా జనాలకు అస్సలు ఇష్టం లేదు. గతంలో తెలుగుదేశం హయాంలో ఎవరైతే టాలీవుడ్ లో చక్రం తిప్పారో వారే మళ్లీ హవా సాగించాలని చూస్తున్నారన్న సంగతిని నేరుగా జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు.

టాలీవుడ్ లో వైకాపాతో అంతో ఇంతో సంబంధాలు వున్న పూరి జగన్నాధ్, మహి, కళ్యాణ్ కృష్ణ లాంటి డైరక్టర్లకు అస్సలు సమాచారమే లేదు. ఈ విషయాన్ని సిఎమ్ పేషీ జనాలు ఆరా తీసారు. దీంతో ఓ సమయంలో టోటల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుందని వినిపించింది. ఆఖరికి రాత్రి బాగా పొద్దుపోయాక కేవలం అయిదుగురే రావాలని వర్తమానం అందింది. కానీ ఇబ్బంది అవుతుందని ఎనిమిది మందికి అంగీకరించాలని తెగ రిక్వెస్ట్ చేసారు.

దాంతో ఓకె అయింది. ఇప్పటికీ వెళ్తున్న టీమ్ లో సురేష్ బాబు, దాము, సి కళ్యాణ్, రాజమౌళి హార్డ్ కోర్ టీడీపీ జనాలే. దిల్ రాజుకు ఇంతో అంతో వైకాపా సంబంధాలు వున్నాయి. నాగార్జున ఒక్కరికే జగన్ తో అనుబందం వుంది. 

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు