టాలీవుడ్‌లో బ్రో సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ సంగతి వినిపిస్తోంది. బ్రో సినిమాలో రెండు చోట్ల పొలిటికల్ డైలాగులు వున్నాయి. దేవుడి పాత్రధారిగా పవన్ భూమి మీదకు వచ్చినపుడే…’దోచేస్తాం.. దాచేస్తాం.. మింగేస్తాం… అంటూ ప్రాసడైలాగులు చెబుతూ అలాంటి వాళ్లను చిటికెలో పట్టుకుపోతా అంటూ పేద్ద డైలాగు చెబుతాడు.
నిజానికి పాపి చిరాయువు అన్నది పెద్దల మాట. పుణ్యాత్ములు త్వరగా పోతారు. పాపాత్ములు ఎక్కువ కాలం భూమి మీద వుంటారు అని మనం జనం సర్వత్రా అంటుంటారు. నమ్ముతుంటారు. సరే ఈ సంగతి అలా వుంచితే, ఒరిజినల్ స్క్రిప్ లో రచయిత త్రివిక్రమ్ ఈ డైలాగు రాయలేదని తెలుస్తోంది. కానీ రచయిత త్రివిక్రమ్ నే కనుక, తన స్నేహితుడు, సచివుడు పవన్ మనసెరిగి ఈ డైలాగు రాసి వుంటారని అంతా నమ్ముతున్నారు.
కానీ త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ లో ఈ పొలిటికల్ టచ్ డైలాగులు ముందుగా లేవు అని తెలుస్తోంది. స్క్రిప్ట్ మొత్తం చదివిన తరువాత ఒకటి రెండు చోట్ల అండర్ లైన్ చేసి, హీరో నే నోట్ పుటప్ చేసి, పొలిటికల్ డైలాగులు రాయించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
గుడివాడ అమర్ నాథ్ గా నర్రా?
ఇదిలా వుంటే సినిమాలో మంత్రి అంబటి రాంబాబును పోలిన శ్యాంబాబు పాత్రను క్రియేట్ చేసినట్లే. మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్ పాత్రను కూడా క్రియేట్ చేసారట. కానీ మరెందుకో లాస్ట్ మినిట్ లో దాన్ని రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ పాత్రను పవన్ కు సన్నిహితుడైన నటుడు నర్రా శ్రీనివాస్ చేయాల్సి వుందనో, చేసారనో తెలుస్తోంది. అది కూడా సినిమాలో వుండి వుంటే గుడివాడ అమర్ నాధ్ వైపు నుంచి కూడా దాడి మొదలై వుండేది.