Advertisement

Advertisement


Home > Movies - Movie News

బుచ్చిబాబు సినిమా వెనక్కి?

బుచ్చిబాబు సినిమా వెనక్కి?

మరో రెండు రోజుల్లో హీరో ఎన్టీఆర్ బర్త్ డే…అప్పుడే ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. ఈ నెల 20న ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్ లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. 

ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ తను చేయబోయే సినిమాకు సంబంధించి ఓ ఫోటో షూట్ ను చేసి రెడీగా వుంచారు. ఆ స్టిల్స్ ను 20న విడుదల చేస్తారు. ఇది ఎన్టీఆర్ కు 30 వ సినిమా.

ఎన్టీఆర్ 31వ సినిమాగా ప్రశాంత్ నీల్-మైత్రీ మూవీస్ సినిమాను ప్రకటించబోతున్నారు. ఎన్టీఆర్ 32వ సినిమా మాత్రం ఇంకా ఎవరితో అన్నది పెండింగ్ లోనే వుంటుంది. 

ఉప్పెన బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా అన్న టాక్ మొన్నటి దాకా వుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అబేయన్స్ లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

31, 32 సినిమాలు పూర్తి కావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తారో? ఎవరితో చేస్తారో? అన్నది అప్పటి వరకు తేలే సంగతి కాదు. 

చూస్తుంటే బుచ్చిబాబు తన స్క్రిప్ట్ ను వేరే హీరోతోనో లేదా వేరే స్క్రిప్ట్ తో వేరే హీరోనూ రెడీ చేసుకోవాల్సి వుంటుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?