ఉప్పెన లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తరువాత, చేతిలో మాంచి ఎమోషనల్ పాన్ ఇండియా లెవెల్ స్టోరీ వున్న తరువాత కూడా ఖాళీగా వుండాల్సి వచ్చింది. సరైన రేంజ్ హీరోల డేట్ లు దొరక్కపోవడమే తప్ప మరో కారణం లేదు.
ఎన్టీఆర్ కోసం చూసి చూసి, ఆఖరికి బయటకు వచ్చి రామ్ చరణ్ తో సినిమా చెేతిలోకి వచ్చింది. కానీ, ఇప్పుడు మళ్లీ అది కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు వున్నాయని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ సినిమా కన్నా ముందు రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వినిపించడం ప్రారంభమైంది.
మొన్న బుచ్చి బాబు సినిమా అనౌన్స్ చేసినపుడే దానికి ఓ నెంబర్ ఇవ్వలేదు. అప్పుడే ఫ్యాన్స్ కిందా మీదా అయ్యారు ఈ సినిమా ముందు మరే సినిమా అయినా వుందా అని తర్జన భర్జన పడ్డారు. ఇప్పుడు వినిపిస్తున్న సంగతి ఏమిటంటే, కన్నడ దర్శకుడు నర్తన్ తో సినిమా ప్లానింగ్ లో వుంది అని.
రామ్ చరణ్ కు అత్యంత సన్నిహితుడు, యువి సంస్థ విక్రమ్ దాన్ని నిర్మిస్తారని టాక్. దాని తరువాత బుచ్చిబాబు సినిమా వుంటుంది అంటున్నారు. ఈ విషయం తేలాల్సి వుంది. ఒకవేళ ఇదే నిజమైతే బుచ్చిబాబు మళ్లీ వెయిటింగ్ లో వుండాల్సి వస్తుంది. అలా కాకుండా పారలల్ గా కనుక చేస్తే బుచ్చిబాబు సినిమా 2023లో అయినా అభిమానుల ముందుకు వస్తుంది.