సాధారణంగా ఏ సినిమా మీడియా మీట్ పెట్టినా క్యూ అండ్ ఎ అనబడు ప్రశ్నలు- జవాబులు అనే కార్యక్రమం వుంటుంది. ఏవో ప్రశ్నలు.. ఏవేవో జవాబులు కలిసి, యూ ట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయితే, సినిమాకు బజ్ వస్తుందని నమ్మకం. అందుకే ఈ విధాయక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వుంటారు. కానీ బన్నీ బ్రదర్ అల్లు శిరీష్ మాత్రం ఈ కార్యక్రమం వద్దనుకున్నాడు. ఎందుకో మరి?
నిన్నటికి నిన్న జరిగింది, అల్లు శిరీష్ సినిమా బడ్డీ ట్రయిలర్ విడుదల కార్యక్రమం. చాలా కాలం అయింది అల్లు శిరీష్ మీడియా ముందుకు వచ్చి. బోలెడు క్వశ్చన్లు వున్నాయి మీడియా దగ్గర. ఎందుకు శిరీష్ హైదరాబాద్ లో తక్కువగా, ముంబాయిలో ఎక్కువగా వుంటున్నాడు.
ఎందుకు గీతా సంస్ధ చిన్న చిన్న హీరొలతొ కూడా సినిమాలు చేస్తోంది కానీ అల్లు శిరీష్ తో చేయడం లేదు. అసలు అల్లు శిరీష్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? ఇలా చాలా చాలా. అన్నింటికి మించి మెగా ఫ్యామిలీలో అన్ ఫాలో వ్యవహారాలు, నల్గొండ ప్రచారం, ఇంకా చాలానే వున్నాయి.
కానీ కార్యక్రమం మొత్తం సుదీర్ఘ ప్రసంగాలతో నింపేసి, క్యూ అండ్ ఎ లేదు అనే కబురు చల్లగా చెప్పేసి, మీడియాను పంపేసారు. అప్పుడు అర్థం అయితే అల్లు శిరీష్ కావాలనే ప్రశ్నలకు దూరంగా, జవాబులకు మరింత దూరంగా వుండాలని అనుకుంటున్నారని. అంతా బాగానే వుంది. త్వరలో సినిమా విడుదల టైమ్ లో అయినా మీడియాను ఫేస్ చేయాలి. అప్పుడు కూడా ఇవే స్టాక్ క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోతే బెటర్.