బన్నీ ప్లస్సూ.. త్రివిక్రమ్ మైనస్సూ

ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన దర్శకుడు త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా సినిమా ప్రకటన వచ్చేసింది. తెలుగు వరకు మాంచి క్రేజ్ వున్న దర్శకుడు త్రివిక్రమ్. అందులో సందేహం లేదు. కానీ ఆయన ఇప్పటి…

ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమైన దర్శకుడు త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా సినిమా ప్రకటన వచ్చేసింది. తెలుగు వరకు మాంచి క్రేజ్ వున్న దర్శకుడు త్రివిక్రమ్. అందులో సందేహం లేదు. కానీ ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఏవీ డబ్బింగ్ పరంగా కూడా ఇతర భాషల థియేటర్లకు వెళ్లలేదు. 

బ్లాక్ బస్టర్ అనుకున్న అల వైకుంఠపురములో సినిమా కూడా హిందీలో డిజాస్టర్ అయింది. త్రివిక్రమ్ ఫక్తు ఫ్యామిలీ మూవీలు తీస్తారు. అందులో తెలుగు పాత సినిమాల లైన్లు ఎత్తేస్తారు అనే టాక్ వుంది. అలాగే ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్లు కూడా ఇంగ్లీష్ సినిమాల నుంచి కొట్టేసినవి అనే టాక్ కూడా వుండనే వుంది.

ఇలాంటి నేపథ్యంలో యూనివర్సల్ అప్పీల్ వున్న సబ్జెక్ట్ తీసుకుని, త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వుంటుంది. కేవలం మాటలతో మ్యాజిక్ చేయడం ఇతర భాషల్లో సాధ్యం కాదు. బలమైన ఒరిజినల్ సీన్లు వుండాలి. కానీ ఇక్కడ ప్లస్ ఏమిటంటే బన్నీ. అల్లు అర్జున్ తన సినిమాల మీద మాంచి కేర్ తీసుకుంటారు. ప్రతీదీ తాను కూడా ఇన్ వాల్వ్ అయి చూసుకుంటారు. అందువల్ల కచ్చితంగా సబ్జెక్ట్ విషయంలో, టెక్నికల్ టీమ్ విషయంలో, టేకింగ్ విషయంలో ఆ కేర్ వుంటుంది. అది సినిమాకు ప్లస్ అవుతుంది.

త్రివిక్రమ్ పేరు నార్త్ లో పరిచయం లేదు. మలయాళం, కన్నడలో కూడా అంతే. బట్ బన్నీ పేరు మీదే హడావుడి జరగాలి. అటు హిందీలో పుష్ప సిరీస్ తో వచ్చిన క్రేజ్ ఉపయోగ పడుతుంది. ఎన్టీఆర్-చరణ్ లను రాజమౌళి నార్త్ కు తీసుకెళ్తే, ఇక్కడ త్రివిక్రమ్ ను మాత్రం బన్నీ తీసుకెళ్లాల్సి వుంటుంది.

డబ్బులు పెట్టడం విషయం కాదు. యూనివర్సల్ స్టోరీ లైన్ కుదరాలి. సీన్లలో ఒరిజినాలిటీ వుండాలి. కొత్తదనం వుండాలి. అన్నింటికన్నా కీలకం నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టుకోగలగాలి.