కొనుక్కున్న జామకాయ కన్నా కొట్టేసిన జామకాయ తీపి అంటుంది భానుప్రియ సితార సినిమాలో. అలాగే టాలీవుడ్ లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ల కన్నా అనఫీషియల్ లీకులకే క్రేజ్ ఎక్కువ. అలాగే ఓ అనఫీషియల్ లీక్ బయటకు వదిలారు.
దర్శకుడు హరీష్ శంకర్ సన్నిహితులే ఫోన్ చేసి త్వరలో రవితేజ తో సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందోచ్ అని చెప్పేసారు. దాంతో ఆ వార్త కాస్తా ట్వీట్టర్ లో వైరల్ అయిపోయింది. ఈ నెలలోనే అనౌన్స్ మెంట్ అంటున్నారు.
సరే, ఆ సంగతి అలా వుంచితే రవితేజ మొత్తం ఎన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ప్రశ్న. ఇప్పటికిప్పుడు వెంటనే చేసేది మైత్రీ మూవీస్-గోపీచంద్ మలినేని సినిమా. ఆ తరువాత చేయాల్సింది సితార సంస్థలో కొత్త దర్శకుడి సినిమా. ఇది కాక మరో రెండు, మూడు సినిమాలు ఓకె చేసారు. ముందు వెనుకల సంగతి తెలియదు కానీ, అభిషేక్ నామాకు ఓ సినిమా, దర్శకుడు సందీప్ రాజ్ కు ఓ సినిమా, దిల్ రాజు-నక్కిన త్రినాధరావు తో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొదటి రెండు సినిమాలు చేసేసరికి 2023 అయిపోతుంది. ఆ తరువాత మూడు సినిమాలతో పాటు హరీష్ సినిమా కూడా రేస్ లో వుండొచ్చు. ఏది ముందు..ఏది వెనుక అన్నది చూడాలి. మొత్తం మీద చూస్తుంటే 2024 ఆఖరు వరకు రవితేజ సినిమాలు సెట్ చేసి వుంచుకున్నట్లు కనిపిస్తోంది.
ఇదిలా వుంటే హరీష్ శంకర్ తాను చేస్తున్న ఉస్తాద్ సినిమా పూర్తి చేసి కానీ రవితేజ సినిమా మీదకు వెళ్లే అవకాశాలు అయితే చాలా తక్కువ.