నిర్మాత బన్నీ వాస్ నుంచి మరో మాంచి సినిమా రాబోతోంది. దానికి మాంచి టైటిల్ ఫిక్స్ చేసారు కోటబొమ్మాళి పిఎస్. అదీ టైటిల్. జిఎ 2 పతాకంపై బన్నీ వాస్, వింధ్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సూపర్ హిట్ నయాట్టు సబ్జెక్ట్ ను తీసుకుని, తెలుగుకు అనుగుణంగా మార్చి ఈ సినిమా చేస్తున్నారు. కీలక పాత్రల్లో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రలు పోషించే సినిమాను గీతా 2 సంస్థ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
టైటిల్ ప్లస్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా వదలిన మెటీరియల్ కూడా ఇంట్రస్టింగ్ గా వుంది. మోషన్ పోస్టర్ సినిమా కంటెంట్ ను క్లారిటీగా, హార్డ్ హిట్టింగ్ గా చూపించింది. పొలిటికల్, బ్యూరోక్రసీ అరాచకాల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. కీలక పాత్రలు మూడూ పోలీస్ శాఖకు చెందినవే. వాటి పరుగు, ఆ నేపథ్యంలో చూపించిన ప్రాపర్టీస్ అన్నీ జానర్ ను కథను ఇండైరెక్ట్ గా చెప్పేసాయి.
రంజన్ రాజ్, మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన టెక్నీషియన్ల పేర్లు త్వరలో అనౌన్స్ చేస్తారు.