రైల్లో కాల్పులు.. న‌లుగురు మృతి

జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తున్న నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కాల్చిచంపాడు. బాధితుల్లో ముగ్గురు ప్రయాణికులు కాగా, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) కూడా ఉన్నారు. ఇవాళ…

జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తున్న నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కాల్చిచంపాడు. బాధితుల్లో ముగ్గురు ప్రయాణికులు కాగా, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) కూడా ఉన్నారు. ఇవాళ తెల్ల‌వారుజామున వాపి-బొరివ‌లి స్టేష‌న్‌ల మ‌ధ్య ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

పోలీసుల వివ‌రాల ప్రకారం.. జైపూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12956) బి5 కోచ్‌లో ఈ ఘటన జరిగింది. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న సిటి చేతన్.. ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు ముగ్గురు ప్ర‌యాణికులపై కాల్పులు జ‌ర‌ప‌డంతో ఆ న‌లుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 

కాల్పుల అనంత‌రం నిందితుడు ద‌హిస‌ర్ స్టేష‌న్ స‌మీపంలో రైలు నుండి దూకి పారిపోయేందుకు య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు అత‌న్ని మీరా రోడ్ వ‌ద్ద‌ అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు ఎందుకు జ‌ర‌పాల్సి వ‌చ్చింది అనే విష‌యం తెలియాల్సి ఉంది.