Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరోల పారితోషికాలు పైకి చెప్పుకోవడానికే..!

హీరోల పారితోషికాలు పైకి చెప్పుకోవడానికే..!

ప్రస్తుతం థియేట్రికల్ సిస్టమ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమా చూడ్డానికి ప్రేక్షకుడు థియేటర్ కు రావడం లేదు. సో.. చిన్న సినిమా జనాలు మెంటల్లీ ప్రిపేర్ అయిపోయారు. పెద్ద సినిమాకు ఎలాగూ ఆక్యుపెన్సీ ఉంటోంది. ఎటొచ్చి సమస్య అంతా మిడ్-రేంజ్ హీరోలతోనే వచ్చింది.

వీళ్ల సినిమాలకు ప్రేక్షకులు వస్తున్నారంటే వస్తున్నారు, రావట్లేదంటే రావట్లేదు అనుకోవాలి. ఆక్యుపెన్సీ బొటాబొటిగా ఉంటోంది. అంటేసుందరానికి ఆక్యుపెన్సీ బాగా తగ్గగా, విరాటపర్వంకు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైమ్ లో మిడ్-రేంజ్ హీరోలు చాలామంది (ఒకరిద్దరు తప్ప) రెమ్యూనరేషన్లు పెంచారు. ఇది ఎంతవరకు కరెక్ట్?

"బయట రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ అది చాలా సెన్సిటివ్ లేయర్. రెమ్యూనరేషన్లు పెంచారని బయట అనుకుంటున్నారు తప్ప, హీరోలు కూడా బిజినెస్ లో భాగమే. నేను చాలామంది హీరోల్ని చూశాను. తమ సినిమా లేదా నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలామంది హీరోలు ముందుకొచ్చి ఆదుకున్నారు. రిలీజ్ రోజు డబ్బులు ఎడ్జెస్ట్ కాకపోతే.. తమ రెమ్యూనరేషన్ తర్వాత ఇవ్వమని కోపరేట్ చేసే చిన్న హీరోలు, మిడ్-రేంజ్ హీరోలు చాలామంది నాకు తెలుసు. ఆ తర్వాత వాళ్ల రెమ్యూనరేషన్లు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి."

ఇలా హీరోల రెమ్యూనరేషన్లపై స్పందించాడు నిర్మాత బన్నీ వాసు. ఇండస్ట్రీలో ఒకరిద్దరు తప్ప, ఎవ్వరూ పారితోషికాలపై మడికట్టుకొని కూర్చోరని అన్నాడు. కోట్లలో రెమ్యూనరేషన్ అనేది కేవలం హైప్ కోసం చెప్పే మాటని... ప్రతి హీరోకు, ప్రతి సినిమాకు అది మారిపోతుంటుందంటున్నాడు.

మన హీరోలు చాలా స్మార్ట్ అంటున్నాడు బన్నీ వాస్. నిజంగా సినిమా హిట్టయితే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారని.. ఎక్కడైతే ఇబ్బంది ఉందో, వెంటనే అక్కడ సర్దుబాటు చేసుకుంటారని తెలిపాడు. దర్శకులు, నిర్మాతలకు హీరోల నుంచి పూర్తి సహకారం దొరుకుతోంది కాబట్టే, టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలొస్తున్నాయనేది బన్నీ వాస్ మాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?