సరైన స్క్రీన్ ప్లే, రైటింగ్ స్కిల్స్ కరువై బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసిన సినిమా ‘బుట్టబొమ్మ’. మాతృకకు చేసిని అదనపు మార్పులు వికటించాయో, ఆకట్టుకోలేదో, మొత్తానికి సినిమాను జనాలు ఇలా తీసి అలా పక్కన పెట్టారు. దీని వల్ల సితార సంస్థకు మూడు కోట్లు నష్టం తప్పలేదు. అది కూడా నాన్ థియేటర్ హక్కులు గట్టిగా రాబట్టడం వల్ల అలా తక్కువతో బయటపడ్డారు.
నిజానికి అంతకు ముందు తీసిన వరుడు కావలెను కూడా నష్టమే మిగిల్చింది. అంతన్నాడు..ఇంతన్నాడు అన్నట్లు ఆ సినిమాకు హడవుడి అయితే జరిగింది తప్ప లాభాలు మాత్రం రాలేదు.
ఇప్పుడు ఆ నష్టాన్ని సర్ సినిమా భర్తీ చేసేసింది. తొలి మూడు రోజుల్లోనే ఫ్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కనీసంలో కనీసం ఆరు కోట్లకు పైగా ప్రాఫిట్ ను అంచనా వేస్తున్నారు. అంటే బుల్లి బుట్టబొటమ్మ ఇచ్చిన భారీ మూడు కోట్ల నష్టాన్ని ‘సర్’ వెనక్కు ఇచ్చిందన్నమాట. కానీ మొత్తం మీద ఇదో పాఠంలా వుంది నిర్మాత అయిన సితార సంస్థకు.
వరుడు కావలెను, బుట్టబొమ్మ ల్లాంటి చిన్న సినిమాలు ఇక అటెంప్ట్ చేయకూడదని, వీలయినంత వరకు ఒక రేంజ్ సినిమాలు మాత్రమే అటెంప్ట్ చేయాలని డిసైడ్ అయింది సితార సంస్థ.