కార్ల దొంగతనం కేసులో ఓ ముఠా పట్టుబడింది. ఈ ముఠాలో సినీ నటుడు ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున కార్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో పోలీసుటు గట్టి నిఘా పెట్టారు. ఎట్టకేలకు కార్ల దొంగతనానికి పాల్పడే ముఠా పోలీసులకు పట్టుబడింది. పోలీసులు విచారణలో ఆ ముఠాలో ఓ వ్యక్తి సినీ నటుడని తేలింది. అంతేకాదండోయ్ సదరు దొంగ ప్రస్తుతం జర్నలిస్టుగా కూడా కొనసాగుతున్నట్టు సమాచారం.
లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ మీడియాతో మాట్లాడుతూ ఇంత వరకు 50కి పైగా లగ్జరీ కార్లు దొంగతనానికి గురయ్యాయన్నారు. లగ్జరీకి అలవాటు పడ్డ యువత సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా కార్ల దొంగతనాన్ని ఎంచుకున్నారన్నారు. చోరీ ముఠాలో ఒకతను మూడు సినిమాల్లో కూడా నటించాడన్నారు. సినిమాల్లో సంపాదించే డబ్బు సరిపోక పోవడంతో ఖాళీ సమయంలో కార్ల దొంగతనానికి కూడా పాల్పడినట్టు ఆయన చెప్పారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో సంచలనమైంది.