ఇవాళ్టి నుంచి టీవీల్లో సందడే సందడి

మధ్యాహ్నం అయింది.. బుల్లితెరపై సందడి మొదలైంది. మహిళా ప్రేక్షకుల ప్రాణాలు లేచొచ్చాయి. అవును.. కొద్దిసేపటి కిందట టీవీల్లో సీరియల్స్ ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ తో 2 నెలలుగా ఆగిపోయిన సీరియల్స్ అన్నీ ఈరోజు నుంచి…

మధ్యాహ్నం అయింది.. బుల్లితెరపై సందడి మొదలైంది. మహిళా ప్రేక్షకుల ప్రాణాలు లేచొచ్చాయి. అవును.. కొద్దిసేపటి కిందట టీవీల్లో సీరియల్స్ ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ తో 2 నెలలుగా ఆగిపోయిన సీరియల్స్ అన్నీ ఈరోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని ఎంటర్ టైన్ మెంట్స్ ఛానెల్స్ లో ఫ్రెష్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన వెంటనే ముందుగా సెట్స్ పైకి వెళ్లినవి సీరియల్స్ మాత్రమే. పరిమిత సంఖ్యలో సిబ్బంది, చకచకా షూటింగ్ చేసే వెసులుబాటు, ఇన్-డోర్ లోనే షూటింగ్ చేయడం లాంటి అంశాలు సీరియల్స్ కు కలిసొచ్చాయి. ఫలితంగా వెంటనే కొత్త ఎపిసోడ్స్ రెడీ అయిపోయాయి. ఈరోజు నుంచి మహిళలంతా మరోసారి టీవీలకు అతుక్కుపోతున్నారు.

ఈటీవీలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సీరియల్స్ కొత్త ఎపిసోడ్స్ ప్రసారం మొదలైంది. ప్రైమ్ టైమ్ లో వచ్చే స్వాతి చినుకులు, మనసు మమత లాంటి సీరియల్స్ కూడా ఈరోజు నుంచి కొనసాగనున్నాయి. అటు జెమినీలో మధ్యాహ్నం 12 గంటల నుంచే కొత్త సీరియల్స్ సందడి మొదలైంది. అయితే ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే సీరియల్స్ ను మాత్రం ఈనెల 29 నుంచి ప్రసారం చేయబోతోంది జెమినీ. స్టార్ మా, జీ తెలుగులో కూడా ఇవాళ్టి నుంచి కొత్త ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి.

మరోవైపు నాన్-ఫిక్షన్ కార్యక్రమాల ప్రసారాలు కూడా మరో 2 రోజుల్లో పూర్తిస్థాయిలో ఊపందుకుంటాయి. జబర్దస్త్, ఢీ, అదిరింది, ఆలీతో జాలీగా, క్యాష్ లాంటి కార్యక్రమాలు కొన్ని రెడీ అయినప్పటికీ.. ఈ వారాంతానికి పూర్తిస్థాయిలో అన్నీ అందుబాటులోకి వస్తాయి.

సీరియల్స్, నాన్-ఫిక్షన్ షోలు అందుబాటులోకి రావడంతో ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ ఉన్నంతలో కాస్త గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆ ఛానెల్ లో పనిచేస్తున్న సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

చంద్రబాబు,ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై పరువునష్టం దావా

తండ్రి పాలిట రాక్షసిలా మారిన పూజా