కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. రెండు నెలలు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుండడంతో ప్రభుత్వాలు పునరాలోచన చేశాయి. దీంతో క్రమంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ వచ్చాయి. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా కరోనా వైరస్ అటాక్ చేస్తోంది.
తాజాగా చిత్ర పరిశ్రమకు సంబంధించి కుటుంబ సభ్యురాలు కరోనా బారిన పడ్డారు. అర్జున్ చిత్రంలో మహేశ్‌బాబు సోదరిగా నటించిన కీర్తిరెడ్డి, నటుడు సామ్రాట్ సోదరి శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఫ్యాషన్ రంగంలోని వారికి, సినీ అభిమానులకు ఆమె పేరు సుపరిచితమే. మోడల్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా శిల్పారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.
రెండు వారాల క్రితం ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఇంటికి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఐదు రోజులకు తనకు, తన భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆమె వెల్లడించారు. తమలో కరోనా లక్షణాలేవి కనిపించలేదని శిల్పారెడ్డి పేర్కొన్నారు. కానీ వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా అని తేలడంతో భర్తతో పాటు తాను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుక్నుట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా శిల్పారెడ్డి ఓ వీడియో షేర్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా, ఎప్పుడైనా కరోనా బారిన పడొచ్చన్నారు. ఎలాంటి ఆందోళన చెందకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని ఆమె సూచించారు.