లాక్డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించిన విషయం తెలిసిందే. కానీ థియేటర్లకు మాత్రం ప్రభుత్వం నో అని చెప్పింది. ఇదిలా ఉండగా బుల్లితెర, వెండితెర షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ కొత్త సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. చిరంజీవి చిన్నల్లుడికి సినిమాల్లో నటించడం ఇష్టం. విజేత సినిమాతో ఆయన వెండితెరకు పరిచయం అయ్యాడు.
డైరెక్టర్ పులి వాసు నేతృత్వంలో కల్యాణ్‌దేవ్ హీరోగా సూపర్‌మచ్చి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది కల్యాణ్‌కు రెండో సినిమా. లాక్డౌన్ అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రామానాయుడు స్టూడియోలో సూపర్‌మచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. చివరి షెడ్యూల్ల్లో భాగంగా కీలక సన్నివేశాలను కల్యాణ్‌దేవ్, రచితారామ్, అజరులైనపై దర్శకుడు చిత్రీకరించాడు. ఈ సినిమాను రిజ్వాన్ నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాపై మెగాస్టార్ చిన్నల్లుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలని కల్యాణ్‌దేవ్ ఎంతో శ్రమిస్తున్నారని సమాచారం. మెగా అభిమానుల్ని కల్యాణ్‌దేవ్ ఏ మాత్రం సంతృప్తి పరుస్తారో చూడాలి మరి.