cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

భ‌ర్త‌పై కేసు - హాట్ బ్యూటీ యూట‌ర్న్‌

భ‌ర్త‌పై కేసు - హాట్ బ్యూటీ యూట‌ర్న్‌

భ‌ర్త‌పై కేసు విష‌యంలో హాట్ బ్యూటీ యూట‌ర్న్ తీసుకొంది. హ‌నీమూన్ కూడా పూర్తి కాకుండానే భ‌ర్త‌పై వేధింపుల కేసు పెట్టిన హాట్ బాంబ్ పూన‌మ్ పాండే ... ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నారు. పెళ్లైన 12 రోజుల‌కే త‌న‌ను భ‌ర్త వేధిస్తున్నాడ‌ని పూన‌మ్ మూడురోజుల క్రితం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

దీంతో పూన‌మ్ భ‌ర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. ఈ నేప‌థ్యంలో భ‌ర్త‌పై కేసును వెన‌క్కి తీసుకోవాల‌నుకుంటున్న‌ట్టు తాజాగా పూన‌మ్ వెల్ల‌డించారు. దీనికి ఆమె కార‌ణాలు చెప్పుకొచ్చారు. త‌న ముందుకు కూర్చొని శామ్ ఏడుస్తున్నాడ‌ని, దీంతో కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. అయితే శామ్ ఇలా ఏడ్వ‌డం ఇది కొత్తేమి కాద‌న్నారు. గ‌తంలో కూడా త‌న‌ను కొట్టి , మ‌ళ్లీ ఇలాంటి త‌ప్పు చేయ‌న‌ని ఏడ్చే వాడ‌ని ఆమె చెప్పుకొచ్చారు.

ఏడాదిన్న‌ర‌గా త‌న జీవితం ఇదే ర‌కంగా వేద‌న‌తో సాగుతోంద‌ని ఆమె వాపోయారు. పెళ్లైతే అంతా సెట్‌రైట్ అవుతుంద‌ని అనుకు న్నానని ... కానీ శామ్ బాంబేలో ఏ మాత్రం మార్పు రాలేదని ఆమె వాపోయారు. ఈ సంద‌ర్భంగా రెండు రోజుల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ఆమె గుర్తు చేశారు. గోవాలో హ‌నీమూన్‌లో ఉన్నామ‌ని, గొడ‌వ కార‌ణంగా త‌మ గ‌ది నుంచి అరుపులు వినిపించ డంతో హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశార‌ని తెలిపారు.

దీంతో తాను కూడా భ‌ర్త‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు పూన‌మ్ చెప్పారు. తాజాగా బెయిల్‌పై విడుద‌లై వ‌చ్చిన త‌న భ‌ర్త ...త‌నెదుట కూర్చొని ఏడుస్తున్నాడ‌ని, దీంతో తాను ఏ నిర్ణ‌యం తీసుకోలేని ప‌రిస్థితిలో ఉన్నాన‌న్నారు. కుటుంబ సభ్యులు మాత్రం శామ్ బాంబేతో తెగదెంపులు చేసుకోమని సలహా ఇచ్చారని పూనమ్ పేర్కొన్నారు.  

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి!

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

 


×