Advertisement

Advertisement


Home > Movies - Movie News

రోడ్డు యాక్సిడెంట్ చేసిన సీరియల్ నటి

రోడ్డు యాక్సిడెంట్ చేసిన సీరియల్ నటి

సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న నటి లహరి రోడ్డు యాక్సిడెంట్ కు పాల్పడింది. ఈమె పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. శంషాబాద్ లో రాత్రి షూటింగ్ ముగించుకొని తన కారులో ఇంటికి బయల్దేరింది లహరి. దారిలో ఓ బైక్ ను తప్పించబోయి ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్ ను నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అతడ్ని హుటాహుటిన దగ్గర్లోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

యాక్సిడెంట్ తో షాక్ కు గురైన లహరి చాలా సేపు కారు దిగలేదు. పోలీసులు వచ్చిన తర్వాత ఆమెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఎంక్వయిరీకి రావాల్సిందిగా సంతకం తీసుకొని ఇంటికి పంపించేశారు.

శంషాబాద్, ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఈమధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. మొన్నటికిమొన్న మాదాపూర్ లో మద్యం సేవించి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు.. రోడ్డు దాటుకున్న నలుగురు వ్యక్తుల్ని కారుతో ఢీకొట్టారు. వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

అదే రోజు బంజారాహిల్స్ లో మరో ఇద్దరు వ్యక్తులు వేగంగా కారు నడిపి, రోడ్డుపై నడుస్తున్న ఇద్దర్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలు మరవకముందే లహరి కారు యాక్సిడెంట్ తెరపైకొచ్చింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?