Advertisement

Advertisement


Home > Movies - Movie News

క్యాస్టింగ్ కౌచ్‌కు అమ్మాయిలే కార‌ణంః బ్యూటీ

 క్యాస్టింగ్ కౌచ్‌కు అమ్మాయిలే కార‌ణంః బ్యూటీ

క్యాస్టింగ్ కౌచ్‌కు అమ్మాయిలే కార‌ణ‌మ‌ని  అందాల తార అంటోంది. ఏ హీరోయిన్ లేదా అమ్మాయి అయినా ‘నో’ అంటే అవ‌త‌లి వైపు వాళ్లు ఏమీ చేయ‌లేర‌ని ఆమె చెప్పుకొస్తోంది. క్యాస్టింగ్ కౌచ్‌పై ఇలాంటి సంచ‌ల‌న సంగ‌తులు చెబుతున్న ఆ అందాల హీరోయిన్ నందినీ రాయ్.

‘బిగ్ బాస్’ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారామె. అంత‌కు ముందు మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, మాయ త‌దిత‌ర చిత్రాలలో నందినీ న‌టించారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అభిమానుల‌తో తాజాగా ఈ భామ సోష‌ల్ మీడియా వేదిక‌గా చిట్‌చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంది.   

‘ఒక్క సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే కాదు ప్ర‌తి ఒక్క రంగంలోనూ  క్యాస్టింగ్ కౌచ్ అనేది సహజం. అయితే ఎక్క‌డైనా  అమ్మాయిలు వ్య‌వ‌హ‌రించే తీరును బ‌ట్టి అవ‌త‌లి వాళ్ల ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది.  అమ్మాయి లేదా హీరోయిన్ ఎవరైనా సరే.. ‘నో’ అని చెబితే ఎవరూ ఏం చేయలేరు. నో అన్న త‌ర్వాత కూడా ఎవ‌రూ బ‌ల‌వంతం చేసే ప‌రిస్థితి ఉండ‌దు. నావ‌ర‌కూ ఇలాంటివి అనుభవాలు ఎదురవ్వలేదు. కానీ  చాలా దగ్గరగా ఎన్నో సంఘటనలను చూశాను.  క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క  హీరోయిన్లకే ప‌రిమితం చేసి చూడొద్దు.  నాకు తెలిసిన ఐటీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లు చెప్పే కొన్ని విషయాలు విన్నప్పుడు సినిమా ఇండస్ట్రీనే   బెటర్ అనిపించింది.అందువ‌ల్ల  ఏదైనా ఈ విషయంలో అమ్మాయి తీసుకునే నిర్ణ‌యంపైనే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం’ అని నందిని చెప్పుకొచ్చింది.

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?