టాలీవుడ్ లో కొంతమంది తారలకు రెస్టారెంట్ బిజినెస్ ఉంది. ఈ కల్చర్ బాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఉంది. రియల్ ఎస్టేట్ తర్వాత చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన బిజినెస్ రెస్టారెంట్. తమ అభిరుచులకు తగ్గట్టు చాలామంది ప్రముఖులు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. వారిలో కొంతమంది సెలబ్రిటీలు పెట్టిన రెస్టారెంట్స్ ఏంటో చూద్దాం.
ప్రియాంక చోప్రా – సోనా
న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఉన్న రెస్టారెంట్ ఇది. కొంతమంది పార్టనర్స్ తో కలిసి తన అభిరుచికి తగ్గట్టు ప్రియాంక చోప్రా నెలకొల్పిన రెస్టారెంట్ ఇది. రెస్టారెంట్ పేరు నుంచి మెనూ వరకు ఇందులో ప్రతిది ప్రియాంక అభిరుచికి తగ్గట్టు ఉంటుంది.
గోల్ గప్పా షాట్స్ నుంచి బట్టర్ చికెన్ వరకు ఎన్నో రకాల నార్త్ఇండియన్ రుచులు ఇందులో అందుబాటులో ఉంటాయి.
శిల్పాషెట్టి – బాస్టియన్
శిల్పాషెట్టి-రాజ్ కుంద్రా జంటకు చాలా వ్యాపారాలున్నాయి. అయితే వీటిలో ప్రత్యేకంగా శిల్పాషెట్టికి ఇష్టమైంది రెస్టారెంట్ బిజినెస్. బాస్టియన్ పేరిట ముంబయిలో ఈ ముద్దుగుమ్మకు రెస్టారెంట్స్ ఉన్నాయి.
తాజాగా వర్లీలో కూడా ఓ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఈ రెస్టారెంట్స్ అన్నీ సీ-ఫుడ్స్ కు ఫేమస్. సోనమ్ కపూర్, కరణ్ జోహార్, జాన్వికపూర్ లాంటి ఎంతోమంది సెలబ్రిటీలకు ఇది ఫేవరెట్ రెస్టారెంట్. అలా ముంబయి రెస్టారెంట్ బిజినెస్ లో తన మార్క్ చూపించింది శిల్పా.
ధర్మేంద్ర – గరమ్ ధరమ్
ఢిల్లీలో గరమ్ ధరమ్ దాబా చాలా ఫేమస్. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర సినిమాల స్ఫూర్తితో నిర్మించిన రెస్టారెంట్ ఇది. ఇందులో ధర్మేంద్ర నటించిన సినిమాల థీమ్స్ మాత్రమే కాదు, ఆయనకు ఇష్టమైన మెనూ కూడా ఉంటుంది. ఉమాంగ్ తివారీ, మిక్కీ మెహతా 2015లో స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ ను ఇప్పటికే చాలామంది ధర్మేంద్ర అభిమానులు సందర్శించారు.
ఆశా భోస్లే – ఆషాస్ రెస్టారెంట్
ప్రముఖ సింగర్ ఆశా భోస్లే కూడా రెస్టారెంట్స్ బిజినెస్ లో ఉన్నారు. తన పేరిట ఈమె స్థాపించిన రెస్టారెంట్లు ప్రపంచవ్యాప్తంగా 13 లొకేషన్లలో విస్తరించి ఉన్నాయి. అబుదాబి, మాంచెస్టర్, బెహ్రెయిన్, కువైట్ లాంటి చోట్ల ఆషాస్ రెస్టారెంట్లు చాలా ఫేమస్.
విరాట్ కోహ్లి-వన్8 కమ్యూన్
ఇండియన్ టాప్ సెలబ్రిటీ విరాట్ కోహ్లికి కూడా రెస్టారెంట్ బిజినెస్ ఉంది. ఢిల్లీలో వన్-8 కమ్యూన్ పేరిట కోహ్లికి పెద్ద రెస్టారెంట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వంటకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ వ్యవహారాల్ని అనుష్క శర్మ చూసుకుంటోంది.