ఇండియాలో సినిమాలకు సెన్సార్ సిస్టమ్ వుంది. అయినా కూడా బాలీవుడ్ లో రెచ్చిపోయి మరీ సినిమాలు తీస్తున్నారు. తెలుగులో కాస్త కంట్రోల్ లో వుంటోంది. ఇలాంటి టైమ్ లో ఓటిటి లు, ఏటిటిలు వచ్చి మొత్తం వ్యవహారం కట్టుతప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఓటిటి సినిమాలు హిందీలో తీసి, తెలుగులో డబ్ చేసినపుడు పరమ నీచమైన బూతులు యథేచ్ఛగా వాడేస్తున్నారు.
దీనికి తోడు తెలుగు డైరక్టర్లు కూడా ఈ మధ్య వెబ్ సిరీస్ పేరిట బూతు సినిమాలు తీయడం ప్రారంభించేసారు. వెబ్ సిరీస్ లో ఏడుపు సీన్లలో కూడా సెక్స్ ను చూసే పరిస్థితి ని తీసుకువస్తున్నారు. బట్టలు లేకుండా రొమ్ములు నొక్కుకునే సీన్ చూస్తే ప్రేక్షకులకు బాధ కలుగుతుందా? మరే రకమైన ఫీలింగ్స్ కలుగుతాయా? అన్నది ఆ డైరక్టర్లకే తెలియాలి.
చూస్తుంటే ఇక కొన్నాళ్లకి ఈ బూతు వ్యవహారాలు చూసి చూసి ప్రభుత్వం ఓటిటి సినిమాలకు కూడా సెన్సారు షిప్ పెట్టే వరకు తెచ్చుకుంటారేమో? ఆ రోజు ఎంత త్వరగా వస్తే అంత మంచిదేమో?