చైతూ మనసులో ఆ డైరక్టర్

ఓ పక్క బాలీవుడ్ సినిమా మరో పక్క విక్రమ్ కుమార్ థాంక్యూ చేస్తున్న హీరో చైతన్య తరువాత ఏంటీ అన్న దాని మీద చాలా వార్తలు వినిపిస్తున్నాయి. నందినీ రెడ్డిగా అవకాశం ఇస్తున్నారని ఓ…

ఓ పక్క బాలీవుడ్ సినిమా మరో పక్క విక్రమ్ కుమార్ థాంక్యూ చేస్తున్న హీరో చైతన్య తరువాత ఏంటీ అన్న దాని మీద చాలా వార్తలు వినిపిస్తున్నాయి. నందినీ రెడ్డిగా అవకాశం ఇస్తున్నారని ఓ వార్త,  నాంది డైరక్టర్ విజయ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని మరో వార్త.

కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం నాంది డైరక్టర్ విజయ్ చేసిన స్క్రిప్ట్ కొంత వరకు చైతన్యకు నచ్చలేదు.మార్పులు చేర్పుల మీద డైరక్టర్ కూడా చైతూతో ఏకీభవించలేదు. దాంతో ఆ ప్రాజెక్టు అలా ఆగిపోయింది.

అలాగే నందినీ రెడ్డి కి కూడా ఇంకా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల తో ఓ సినిమా చేయాలని చైతూకి చాలా ఆసక్తిగా వుందని తెలుస్తోంది. కానీ వేణు ఊడుగుల ఈసారి మరింత పెద్ద హీరోతో, పెద్ద సినిమా చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

ఇంద్రగంటి మోహన కృష్ణతో ఓ సినిమా ఎప్పటి నుంచో పెండింగ్ లో వుంది. మరే డైరక్టర్ అయినా సెట్ అవుతారా అనే ఆలోచనతో చైతూ తన డెసిషన్ ను అబేయన్స్ లో వుంచేసినట్లు బోగట్టా.