సర్కారు వారి పాటకు ముందు నుంచి వినిపిస్తున్న కాంబినేషన్..నాగ్ చైతన్య-పరశురామ్. ఈ కాంబినేషన్ ఆల్ మోస్ట్ ఫైనల్ అనుకున్నారు. కానీ అంతట్లో మహేష్ బాబు నుంచి పిలుపు వచ్చింది. సర్కారు వారి పాట చేయాల్సి వచ్చింది. నాగ్ చైతన్య అవాక్కయ్యాడు..నిర్మాతలు అయిన 14 రీల్స్ కూడా డిటో..డిటో. సర్కారు వారి తరువాత మళ్లీ వెనక్కు వచ్చారు కానీ ఈ సారి చైతన్య బిజీ. మొత్తానికి పరశురామ్ కథ చెప్పారు కానీ నచ్చలేదు. ఓ పక్కన చైతన్య కోసం ప్రయత్నిస్తూనే మరో పక్క వేరే ట్రయిల్స్ కూడా వేసుకుంటూ వచ్చారు.
విజయ్ దేవరకొండ కు రెండు కథలు చెప్పినట్లు, అందులో ఒకటి నచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు కు కూడా అదే కథ నచ్చింది. దాంతో మొత్తానికి మార్గం సుగమం అయింది. ఇది ఈ రోజో, రేపో అనౌన్స్ మెంట్ రావాల్సి వుంది. ఇది ఒక సంగతి.
ఇక రెండో సంగతి అలాగే వుంది. అదే 14రీల్స్ విషయం. ఎప్పటి నుంచో చేయాల్సిన సినిమా అలా వెనక్కు వెళ్తోంది. చైతన్య కు పరశురామ్ కథ నచ్చక పోవచ్చు. మరో కథ లేదా మరో దర్శకుడు దొరికితే 14రీల్స్ సినిమా వుంటుంది. మరి పరశురామ్ తో చేయాల్సిన సినిమా. అందుకే వేరే హీరోలకు కథలు చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ తమిళ హీరో కూడా వున్నారని, పరశురామ్ కథను ఓకె చేసారని టాక్. అంటే 14 రీల్స్ కు జాక్ పాట్..ఒక సినిమాకు బదులు రెండు సినిమాలు చేతిలో పడతాయి.
బాగానే వుంది. ఇంతకీ పరశురామ్ ఏ సినిమా ముందు చేస్తారు? విజయ్ దేవరకొండదా? తమిళ హీరోదా? అసలు తమ అడ్వాన్స్ వీటన్నింటికన్నా ముందుది..దాని సంగతి ఏమిటి అని పరశురామ్ కు అడ్వాన్స్ ఇచ్చిన మరో సీనియర్ నిర్మాత అడగానికి సిద్దం అవుతున్నారట. అది వేరే సంగతి.