చందు – చైతూ – కొలిక్కి వస్తోంది

నాగ్ చైతన్య-గీతా సంస్థ అన్నది ఫిక్స్. అందులో సందేహం లేదు. చైతన్య చేయబోయే తరువాత సినిమా ఇదే. అందులోనూ సందేహం లేదు. కానీ ఇంకా ఎక్కడ లాక్ వుందీ అంటే రెండే రెండు చిన్న…

నాగ్ చైతన్య-గీతా సంస్థ అన్నది ఫిక్స్. అందులో సందేహం లేదు. చైతన్య చేయబోయే తరువాత సినిమా ఇదే. అందులోనూ సందేహం లేదు. కానీ ఇంకా ఎక్కడ లాక్ వుందీ అంటే రెండే రెండు చిన్న పాయింట్ల దగ్గర. ఈ కథ గీతా దగ్గర ఎప్పటి నుంచో వుంది. 

కాస్త బడ్జెట్ ఖర్చయ్యే కథే. చైతన్య హీరోగా అంటే 60 కోట్లు ఖర్చవుతుంది. ఆ రేంజ్ ఖర్చు చేసేటపుడు ఆ రేంజ్ డైరక్టర్ కావాలి. చందు మొండేటి అయితే మార్కెట్ కాంబినేషన్ బాగుంటుంది. కానీ చందు ఇప్పటికే సూర్య ను తన కథ తో ఒప్పించి వున్నారు. ఆ సినిమా చేయాలి. ఈ లోగా ఈ సినిమా కూడా చేయించేయాలన్నది గీతా సంస్థ ఐడియా.

ఇదిలా వుంటే స్క్రిప్ట్ సెకండాఫ్ లో చిన్న చిన్న ఫైన్ ట్యూనింగ్ చేయించాలన్నది హీరో చైతన్య సలహా. అది నిర్మాతలు అరవింద్ , బన్నీ వాస్ లకు కూడా ఓకె అనిపించింది. ఇప్పుడు ఆ పని జరుగుతోంది. అది పూర్తయితే డైరక్టర్ ను ఫిక్స్ చేసుకోవడం మాత్రం మిగిలి వుంటుంది.

చందునే తొంభై శాతం దర్శకత్వం చేసే అవకాశం వుంది. లేదూ అంటే ఒకటి రెండు సినిమాలు చేసిన దర్శకుడిని ఫిక్స్ చేసి, చందు దర్శకత్వ పర్యవేక్షణ అనే టైటిల్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. మొత్తానికి గీతా నుంచి త్వరలో రాబోతున్న పెద్ద సినిమా అయితే ఇదే.