'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ అయ్యేది వచ్చే సంక్రాంతికే అని ఖచ్చితమైన వార్తలు వినిపిస్తున్నా కానీ అందులో నటిస్తోన్న ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, చరణ్‌కి జూన్‌లోగా ఫ్రీ అయిపోతారు. 'ఆర్.ఆర్.ఆర్' ప్రమోషన్స్ చేయడానికి మినహా వారితో తర్వాత రాజమౌళికి పని వుండదు. అందుకే వెంటనే చెరొక చిత్రం చేయాలని డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా ఖాయం చేసుకున్నాడు.
చరణ్‌కి కూడా కొరటాల శివతో కమిట్‌మెంట్ వుంది కానీ అతనిప్పుడు చిరంజీవి చిత్రంతో బిజీగా వుండడంతో చరణ్ వేరే ఆప్షన్లు కన్సిడర్ చేసాడు. అనిల్ రావిపూడి చిత్రాలు మాస్‌కి నచ్చుతున్నాయి కనుక 'సరిలేరు నీకెవ్వరు' చూసి అతనితో సినిమాపై కాల్ తీసుకోవాలని అనుకున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ అనిపించుకున్నా కానీ అనిల్ రావిపూడి ఆలోచనలు చరణ్‌ని ఎక్సయిట్ చేయలేదు.
మాస్ ఎంటర్‌టైనర్స్ పేరు చెప్పి బ్రూస్‌లీ, వినయ విధేయ రామ చిత్రాలతో భంగపడ్డ చరణ్ మళ్లీ ఆ బాటలో వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడు. అన్నీ కలిసి రాకపోతే అలాంటి చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యే అవకాశముంది కనుక ఇప్పుడు వేరే దర్శకుల పేర్లని చరణ్ పరిశీలిస్తున్నాడు. ఒకరిద్దరు యువ దర్శకులతో అతను టచ్‌లో వుంటున్నట్టు సమాచారం.