యాక్షన్ ఓకే.. స్టయిల్ ఓకే.. కామెడీ ఎక్కడ చారీ!

వెన్నెల కిషోర్.. ఈ నటుడి పేరు చెప్పగానే ఎవరి పెదాలపైనైనా ఓ చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఎవరికైనా ఇట్టే నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటి నటుడు లీడ్ రోల్ లో…

వెన్నెల కిషోర్.. ఈ నటుడి పేరు చెప్పగానే ఎవరి పెదాలపైనైనా ఓ చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఎవరికైనా ఇట్టే నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటి నటుడు లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్నాడంటే ఎవరైనా ఏం ఆశిస్తారు? మరింత ఫన్ ఉంటుందని భావిస్తారు.

కానీ ఈరోజు రిలీజ్ చేసిన చారి-111 సినిమాలో ఆశించిన స్థాయిలో కామెడీ కనిపించలేదు. జేమ్స్ బాండ్ కథను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి కథలు గతంలో కూడా కొన్ని వచ్చాయి. చారి-111 ఆ కోవకు చెందిన సినిమానే.

ఈరోజు రిలీజ్ చేసిన ట్రయిలర్ లో జేమ్స్ బాండ్ తరహా స్టయిల్ కనిపించింది, యాక్షన్ కూడా ఉంది. ఎటొచ్చి వెన్నెల కిషోర్ నుంచి ఆశించిన కామెడీ పంచ్ లు మాత్రం కనిపించలేదు. 2-3 డైలాగ్స్ ఉన్నాయి, కానీ అందులో కడుపుబ్బా నవ్వించే కామెడీ లేదు. బహుశా, మంచి సీన్స్ అన్నీ దాచిపెట్టారేమో.

చారీగా వెన్నెల కిషోర్ మాత్రం స్టయిలిష్ గా కనిపించాడు. అతడి చుట్టూ చాలా కామెడీ జనరేట్ అయిందనే విషయం కనిపిస్తోంది కానీ ఆ ఫన్ మాత్రం ట్రయిలర్ లో చూపించలేదు. కీర్తికుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను మార్చి 1న విడుదల చేయబోతున్నారు.