చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నారు. ఏడెనిమిది కోట్లు అవుతుందనుకున్నారు. ఎందుకంటే విదేశాల్లో చాలా షూట్ వుంది కనుక. కానీ రెండేళ్లకు పైగా పాండమిక్ తినేసింది. వడ్డీలు..వీసాలు రాక వృధా కాల్ షీట్ లు. మరే డైరక్టర్ అయినా ఈ సినిమా కనీసం పదిహేను కోట్లకు డేకేసి వుండేది. కానీ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఎంత పొదుపుగా తీయాలో అంత పొదుపుగానూ తీసారు. దీంతో సినిమా థియేటర్ లాండింగ్ కాస్ట్ జస్ట్ 11 కోట్ల దగ్గర ఆగింది. దాంతో నిర్మాతకు ఫుల్ హ్యపీ.
ఈవారం విడుదల అవుతున్న ఫలానా అమ్మాయి..ఫలానా అబ్బాయి సినిమా సంగతే ఇది. నాగశౌర్య-మాళవిక లతో పీపుల్స్ మీడియా నిర్మించిన ఈ సినిమా ఎన్నో ఒడి దుడుకులకు లోనయింది. అమెరికా వీసాల కోసం నానా పాట్లు పడ్డారు. కోవిడ్ రెండేళ్లు అలా పక్కన వుండిపోయింది సినిమా. చివరికి యూరప్ కు అనుగుణంగా మార్చి షూట్ చేసారు. దానికి అనుగుణంగా మార్చడానికి కూడా కొంత వృధా తప్పలేదు.
ఇంత ఇబ్బంది వచ్చినా బడ్జెట్ ను అన్నీ కలిపి 11 కోట్లు దాటనివ్వకుండా చేయడం అంటే దర్శకుడు అవసరాలను మెచ్చుకోవాల్సిందే. ఏడెనిది కోట్లలో అవుతుందని దిగిన చిన్న సినిమాలను సైతం 15 కోట్లకు చేర్చేసిన దర్శకులు ఎందరో వున్నారు.
ఫలనా అమ్మాయి..ఫలానా అబ్బాయి పెట్టుబడిలో పది కోట్ల వరకు నాన్ థియేటర్ మీదే వచ్చేసింది. అది కూడా కొవిడ్ కు ముందు అమ్మారు కనుక. ఇప్పుడయితే ఇంకా ఎక్కువ వచ్చేసింది. జస్ట్ కోటి రూపాయల రిస్క్ మీద తెలుగు రాష్ట్రాల్లో ఓన్ విడుదలకు వెళ్తున్నారు నిర్మాతలు.