ఏపీ ప్ర‌భుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపి కేంద్ర మంత్రి పదవిని సంతృప్తిగా అనుభవించి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు మాత్ర‌మే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి చేసిన…

ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపి కేంద్ర మంత్రి పదవిని సంతృప్తిగా అనుభవించి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు మాత్ర‌మే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై కౌంట‌ర్ ఇస్తూ ఏపీ ప్ర‌భుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు

వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'యాక్టర్ల రెమ్యూనిషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశల‌ గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయ‌లంటూ' హిత‌వు ప‌లికారు.

కాగా గత కొంతకాలంగా మెగా హీరోల సినిమా ఫంక్షన్ లో సినిమాల‌ కంటే రాజకీయాలు ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయానా రాజకీయాల గురించి మాట్లాడడంతో గతంలో నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు చిరంజీవి జనసేనకు సపోర్ట్ చేస్తారని వార్తలు నిజం చేకూర్చే లాగా ఆయ‌న మాట‌లు ఉన్న‌య‌ని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాగా తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ మీటింగ్‌లో రోజుకు నా సినిమా రెమ్యూనరేషన్ రెండు కోట్లు అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. సినిమా వారు సినిమా వేదిక‌ల‌పై రాజ‌కీయలు మాట్లాడితే త‌ప్పు కాదు కానీ.. రాజ‌కీయ నాయ‌కులు వారి గురించి మాట్లాడితే సినిమా వారి దృష్టిలో పెద్ద త‌ప్పేమే.