సినిమా ఫెయిల్యూర్ .. ఫారెన్ టూర్!

టాలీవుడ్ హీరోల‌కు త‌మ సినిమా జ‌యాప‌జ‌యాలు మాన‌సికంగా కూడా ప్ర‌భావం చూపించేవిగా మారి ఉండ‌టంలో వింత లేదు. కొంద‌రు హీరోలు త‌మ ఫెయిల్యూర్ సినిమాల‌ను అవి ఫెయిల్ అని బాహాటంగా ఒప్పుకుంటూ ఉంటారు. మ‌రి…

టాలీవుడ్ హీరోల‌కు త‌మ సినిమా జ‌యాప‌జ‌యాలు మాన‌సికంగా కూడా ప్ర‌భావం చూపించేవిగా మారి ఉండ‌టంలో వింత లేదు. కొంద‌రు హీరోలు త‌మ ఫెయిల్యూర్ సినిమాల‌ను అవి ఫెయిల్ అని బాహాటంగా ఒప్పుకుంటూ ఉంటారు. మ‌రి కొంద‌రు మాత్రం సినిమాలు ఆక‌ట్టుకోలేన‌ప్పుడు కొంత నిరాశ కూడా చెంది, స్పందించ‌క‌పోవ‌చ్చు కూడా!

ఇలాంటి సంద‌ర్భాల్లో హీరోలు.. ఫారెన్ టూర్ పెట్టుకుని సేద‌తీరుతూ ఉంటారు కూడా! లోక‌ల్ గా వినిపించే డివైడ్ టాక్ ను త‌ప్పించుకోవ‌డానికి అదొక ప‌రిష్కార మార్గం కూడా! ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ఫారెన్ టూర్.. ఈ త‌ర‌హా రిలాక్సేష‌నే అనే టాక్ వ‌స్తోంది.

ఆచార్య సినిమా మెగాస్టార్ ను స‌హ‌జంగానే నిరాశ ప‌రిచి ఉండ‌వ‌చ్చు. త‌న కెరీర్ లో చిరంజీవికి విజ‌యాలూ, ఫెయిల్యూర్లు కొత్తేమీ కాక‌పోవ‌చ్చు. అయితే రీ ఎంట్రీ త‌ర్వాత మాత్రం.. బాగా నిరాశ ప‌రిచిన సినిమా ఇదే. 

సుదీర్ఘ స‌మ‌యం పాటు ఈ సినిమాకు చిరంజీవి స‌మ‌యం కేటాయించారు. అది కూడా త‌న‌యుడితో కలిసి చిరంజీవి పూర్తి స్థాయిలో న‌టించిన సినిమా. ఇలాంటి నేప‌థ్యంలో ఈ సినిమా విజ‌యం సాధించ‌డంపై చిరంజీవికి కూడా ఒక ర‌క‌మైన అంచ‌నాలు ఉండిఉండ‌వ‌చ్చు. అయితే అవ‌న్నీ త‌ల‌కిందుల‌య్యాయి.

ఇలాంటి నేప‌థ్యంలో స‌తీస‌మేతంగా మెగాస్టార్ యూర‌ప్ టూర్ ద్వారా రిలాక్స్ అవుతున్న‌ట్టుగా ఉన్నారు. అయితే ఇంత‌లోనే లూసీఫ‌ర్ రీమేక్ కు సంబంధించిన వార్త‌ల‌ను మీడియాకు ఇచ్చి ఫ్యాన్స్ ను కూడా కాస్త డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉన్నారు.