Advertisement

Advertisement


Home > Movies - Movie News

నక్సలైట్ గా చిరంజీవి.. అప్పుడే లీకులు షురూ

నక్సలైట్ గా చిరంజీవి.. అప్పుడే లీకులు షురూ

కొరటాల సినిమాలో చిరంజీవి పాత్ర ఇదే. అయితే ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కోసం ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అవును.. నక్సలైట్ గెటప్ లో ఉన్న చిరంజీవి లుక్ లీకైంది. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అలా చిరు-కొరటాల సినిమా కూడా లీకులకు బలైంది.

కోకాపేటలో చాన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఎలాంటి లీకులు లేకుండా గట్టి చర్యలు కూడా తీసుకున్నారు. కానీ హఠాత్తుగా నిన్నట్నుంచి ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ వీడియో, కొన్ని స్టిల్స్ నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.

లీకుల గురించి తెలుసుకున్న వెంటనే రామ్ చరణ్ కు చెందిన యూనిట్ అప్రమత్తమైంది. వెంటనే సదరు వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి తొలిగించారు. అయితే ఫొటోల్ని మాత్రం తొలిగించడం వీళ్ల వల్ల కావడం లేదు. ఇప్పటికే ఫేస్ బుక్స్ నుంచి వ్యక్తిగతంగా వాడే వాట్సాప్ గ్రూపుల్లోకి ఈ ఫొటో చేరిపోయింది. దీంతో దీన్ని డిలీట్ చేయడం అసంభవంగా మారింది.

ప్రతి పెద్ద సినిమా సెట్స్ పై ఉంటుండగానే ఇలా లీక్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే లీకుల బారిన పడింది. చిరంజీవి నటించిన సైరా సినిమా కూడా సెట్స్ పైకొచ్చిన వారం రోజులకే లీకుల బారిన పడింది. ఇప్పుడు కొరటాల సినిమాకు కూడా ఈ బాధ తప్పడం లేదు.

ప్రస్తుతం నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ స్టిల్ ను ఎవరు లీక్ చేశారనేది యూనిట్ కు అంతుచిక్కడం లేదు. ఎవరో చాలా దగ్గర్నుంచి ఈ ఫొటో తీశారనే విషయం మాత్రం తెలుస్తూనే ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?