Advertisement

Advertisement


Home > Movies - Movie News

'మా' రచ్చలో కొత్త ట్విస్ట్.. చిరంజీవి ఓపెన్ ఆఫర్

'మా' రచ్చలో కొత్త ట్విస్ట్.. చిరంజీవి ఓపెన్ ఆఫర్

ఎవరు ముందు? ప్రకాష్ రాజ్ ముందుగా తెరపైకి వచ్చాడా? లేక మంచు విష్ణు ముందుగా తెరపైకొచ్చాడా? ప్రకాష్ రాజ్ అందరికంటే ముందుగా వర్క్ స్టార్ట్ చేశాడని చెబుతారు మెగా కాంపౌండ్ సభ్యులు. నరేష్, మోహన్ బాబు వర్గం మాత్రం ముందుగా మంచు విష్ణునే రంగంలోకి దిగాడని చెబుతారు. ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి-మోహన్ బాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను బయటపెట్టాడు బెనర్జీ.

ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగాడని తెలిసిన తర్వాతే మోహన్ బాబు, మంచు విష్ణును దించారని ఆరోపిస్తున్నాడు బెనర్జీ. దీనికి సంబంధించి చిరంజీవి-మోహన్ బాబు మాట్లాడుకున్నారట. ముందుగా ప్రకాష్ రాజ్ ను దించాం కాబట్టి, మంచు విష్ణు అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవాలని చిరంజీవి, మోహన్ బాబును కోరారట. ఇలా చేస్తే, తర్వాత టర్మ్ లో మంచు విష్ణును అంతా కలిసి ఏకగ్రీవం చేసుకుందామని చిరంజీవి ఓపెన్ ఆఫర్ ఇచ్చారట.

కానీ మంచు మోహన్ బాబు పట్టుబట్టి మరీ విష్ణును ఎన్నికల బరిలో నిలిపారని, అక్కడ చిరంజీవి హర్ట్ అయ్యారని చెబుతున్నాడు బెనర్జీ. ఇక్కడే మరో విషయాన్ని కూడా బెనర్జీ ప్రస్తావించాడు.

ఒక దశలో ఇటు ప్రకాష్ రాజ్, అటు విష్ణు నిలిచిన వేళ.. మోహన్ బాబు ప్రెసిడెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగితే పోటీ నుంచి తప్పుకొని ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చిరంజీవి భావించారట. కానీ మోహన్ బాబు దిగకుండా విష్ణును దించడంతోనే సమస్య వచ్చిందంటున్నాడు. బెనర్జీ వ్యాఖ్యలతో ఇప్పుడీ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. అంతా మోహన్ బాబు తప్పే అన్నట్టు మారింది సీన్.

నరేష్ ను ఇంకా ఎందుకు వెంట తిప్పుకుంటున్నారు?

ఎన్నికల్లో కృష్ణుడి పాత్ర పోషిస్తానంటూ చెప్పి శకుని పాత్ర పోషించాడంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నరేష్ పై విమర్శలు గుప్పిస్తోంది. వివాదానికి మూల కారణమైన నరేష్ ను ఇంకా ఎందుకు మంచు విష్ణు వెనకేసుకొని తిరుగుతున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే.

ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ కు పూర్తి మద్దతిచ్చాడు నరేష్. ప్యానెల్ లో సభ్యుల్ని ఎంపిక చేయడం నుంచి ప్రచార వ్యూహాలన్నీ నరేష్ వే అనేది ఓపెన్ సీక్రెట్. అలా దగ్గరుండి విష్ణును గెలిపించాడు నరేష్. కానీ ఇప్పుడు విష్ణు గెలిచిన తర్వాత కూడా ఏ అధికారంతో నరేష్ ఇంకా మాట్లాడుతున్నాడని ప్రశ్నిస్తున్నారు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు.

"మా" సభ్యుడిగా నరేష్ కు మాట్లాడే అర్హత ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ.. గెలిచిన సభ్యులు మాట్లాడితే బాగుంటుందని, కనీసం ఈసీ మెంబర్ గా కూడా లేని నరేష్, తాజా వివాదంపై మాట్లాడ్డం కరెక్ట్ కాదంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?