ఇప్పటికిప్పుడు కుప్పంలో ఎన్నికలు జరిపితే చంద్రబాబుకి డిపాజిట్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి. స్థానిక ఎన్నికలతో కుప్పం సీన్ అంతలా మారిపోయింది. దీంతో వచ్చే ఎన్నికలనాటికి బాబు మరో నియోజకవర్గం వెదుక్కుంటారని అంటున్నారు.
కనీసం అక్కడ లోకేష్ ని సైతం పోటీకి దింపే పరిస్థితి లేదు. అయితే బాబు కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలో లేదా, విశాఖ నలుదిక్కుల్లో ఓ చోట పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఇలా 2 నియోజకవర్గాల్లో బాబు పోటీ చేస్తారని అంటున్నారు.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో బాబుకి చోటిస్తారా..?
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గతంలో ఇలాంటి డబుల్ గేమ్ ఆడారు కానీ, బాబు ఎప్పుడూ అలా చేయలేదు. కానీ పరిస్థితుల ప్రభావం తొలిసారి ఆయన అలా చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది.
తెలిసి తెలిసీ కుప్పంలో పోటీ చేసి ఓడిపోయే కంటే.. సేఫ్ సైడ్ మరో నియోజకవర్గం వెదుక్కుంటే తప్పేం లేదని అంటున్నాయి టీడీపీ వర్గాలు.
చంద్రబాబు కోసం త్యాగం చేసేవారు చాలామందే ఉన్నా ఉత్తరాంధ్రవైపే బాబు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులోనూ విశాఖ నలుదిక్కుల్లోనూ గత ఎన్నికల్లో టీడీపీ పాగా వేసింది.
ఇప్పుడు చంద్రబాబు అందులో ఏదో ఒకటి ఎంచుకుంటారని, అలా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో చోటు దక్కించుకుంటారని చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఇది ఊగాహానమే అయినా వచ్చే ఎన్నికలనాటికి చంద్రబాబు తన అసెంబ్లీ ఎంట్రీ కోసం ఎన్ని ప్రయోగాలైనా చేయాల్సిందే. అయితే భయంతోనే కుప్పం నుంచి పారిపోతున్నారనే అపవాదు వస్తుందని మాత్రం బాబు ఆందోళన పడుతున్నారు.
అలా అని వైరి పక్షం సెటైర్లకు తలొగ్గితే, భవిష్యత్తులో పూర్తిగా పరువు పోతుందనే అనుమానం కూడా ఆయనలో ఉంది. సో.. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తారని అంటున్నారు ఆయన పార్టీ జనాలు.
క్లారిటీ ఇస్తారా..?
టీడీపీలో ఓ వర్గం ఇలాంటివన్నీ పుకార్లేనని కొట్టి పారేస్తున్నా.. రెండు నియోజకవర్గాల వార్తలపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారా లేదా అనేది మాత్రం అనుమానమే.
నేనెక్కడికీ పోను కుప్పంతోనే ఉంటానని ధైర్యంగా చెప్పగలరా? అలా చెప్పి అక్కడే పోటీ చేసి గెలవగలరా..? లేక సేఫ్ గేమ్ కే ఫిక్స్ అవుతారా అనేది తేలాల్సి ఉంది. కుప్పం పర్యటనతో దీనిపై బాబు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.