సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా పుష్ప…ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసారు. దేవీ సంగీతంలో చంద్రబోస్ రాసిన 'చూపే బంగారమాయనె శ్రీవల్లీ..' అనే పాటను సిద్దు శ్రీరామ్ ఆలపించారు.
పాట హుక్ లైన్ ను మాత్రం సూపర్ గా ట్యూన్ చేసాడు దేవీ. తరువాత చరణాలు మాత్రం ఆ రేంజ్ లో లేకున్నా, సిద్దూ వాయిస్ మ్యాజిక్ వల్ల మెలమెల్లగా పట్టేస్తాయి.
చంద్రబోస్ ఈసారి వెరైటీ లిరిక్స్ అందించారు. ఎక్కడైనా హీరోయిన్ అందంగా వుందని పొగుడుతూ హీరో పాట పాడడం కామన్.
కానీ ఈ పాటలో పద్దెనిమిదేళ్లు వస్తే ఎవరైనా అందంగానే వుంటారు…ఎర్రచందనం చీర కడితే ఏ అమ్మాయి అయినా అందంగానే వుంటుంది..నీ స్నేహితులు పెద్దగా బాగోరు కనుక నువ్వు బాగున్నట్లు అనిపిస్తున్నావు.ఈ టైపులో సాగింది పాట అంతా.
దేవీ ఇనుస్ట్రమెంటేషన్ బాగుంది. పాటతో వచ్చిన లిరికల్ విడియోలో బన్నీ కొత్తగా చిన్న సిగ్నేచర్ స్టెప్ ట్రయ్ చేసారు. కానీ అది సినిమాలో మరోలా వుంటుందేమో అన్న చిన్న అనుమానం అయితే వుంది.
అది అలా వుంచితే భద్రాచల రామదాసు కీర్తన..పలుకే బంగారమాయెరా…అన్నది గుర్తుకుతెస్తుంది హుక్ లైన్.